Share News

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Oct 31 , 2024 | 12:09 AM

గ్రామాల్లో జరుగుతున్న సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాల ని సీనియర్‌ సివిల్‌ జడ్జి స్వప్నరాణి అన్నారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

పెద్దపల్లి రూరల్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో జరుగుతున్న సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాల ని సీనియర్‌ సివిల్‌ జడ్జి స్వప్నరాణి అన్నారు. బుధవారం మండలంలోని అప్పన్నపేటలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సద స్సు నిర్వహించారు. సదస్సుకు సీనియర్‌ సివిల్‌ జడ్జి స్వప్నరాణి హజరై మాట్లాడారు. గ్రామాల్లో చదువుకోని వారు చాలా మంది ఉన్నారని, సైబర్‌ నేరాలు గ్రామాల్లోనే అధికమ వుతున్నాయని, సైబర్‌ నేరాల ఉచ్చులో పడి చాలామంది నిరుపేద కుటుంబాలు మోస పోతున్నాయన్నారు. సెల్‌ ఫోన్‌కు ఎలాంటి మె సేజ్‌ వచ్చిన ఓపెన్‌ చేయొద్దని, ఓటిపిలను ఎట్టి పరిస్థితుల్లో చెప్పరాదన్నారు. ప్రతి ఒక్క రికి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో న్యాయవాదులు హను మాన్‌ సింగ్‌, పంచాయతీ కార్యదర్శి శ్రీలతతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 12:10 AM