Share News

రూ.65 లక్షలతో పద్మనగర్‌ జంక్షన్‌ సుందరీకరణ

ABN , Publish Date - Nov 19 , 2024 | 12:28 AM

కరీంనగర్‌-సిరిసిల్ల రోడ్డులోని పద్మనగర్‌ జంక్షన్‌ను 65 లక్షల రూపాయలతో సుందరీకరించాలని నిర్ణయించామని కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. ఇందుకు అవసరమైన డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను వెంటనే సిద్ధం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

రూ.65 లక్షలతో పద్మనగర్‌ జంక్షన్‌ సుందరీకరణ
పద్మనగర్‌లో జంక్షన్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌-సిరిసిల్ల రోడ్డులోని పద్మనగర్‌ జంక్షన్‌ను 65 లక్షల రూపాయలతో సుందరీకరించాలని నిర్ణయించామని కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. ఇందుకు అవసరమైన డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను వెంటనే సిద్ధం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం పద్మనగర్‌ జంక్షన్‌ ఏర్పాటు కోసం స్థలపరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్మార్ట్‌సిటీలో భాగంగా ఈ జంక్షన్‌ను సుందరీకరిస్తామన్నారు. కార్యక్రమంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 12:28 AM