ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ఫలితాలు..
ABN , Publish Date - Dec 29 , 2024 | 12:44 AM
జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడి యట్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రయత్నించాలని అదనపు కలెక్టర్ వేణు పేర్కొన్నారు.
పెద్దపల్లి కల్చరల్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడి యట్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రయత్నించాలని అదనపు కలెక్టర్ వేణు పేర్కొన్నారు. కలెక్టరేటర్ సమావేశమందిరంలో జిల్లాలోని జూనియర్ కళా శాలల ప్రిన్సిపాళ్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి డి కల్పన ఆధ్వర్యంలో ఈ సమా వేశం ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని ప్రిన్సిపాల్‌లను ఆదేశించారు. అలాగే విద్యార్థులకు డ్రగ్స్ నివారణ కోసం ఇవ్ టీచింగ్ నివారణ కోసం పోలీస్ అధికారులు కొన్ని సూచనలు చేశారు. ఇంటర్మీడియట్ డైరెక్టర్ నిర్దేశించిన 90 రోజుల ప్రణాళికను పాటిస్తూ కళాశాలల్లో మంచి ఫలితాలను సాధించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో, డీసీపీ రాజు, ఏసీపీ రమేష్, అధి కారులు పాల్గొన్నారు.