రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN , Publish Date - Nov 17 , 2024 | 12:09 AM
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
కళ్యాణ్‌నగర్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యంతో పాటు వారి పట్ల మర్యాదగా ప్రవర్తించా లని వైద్యులు, వైద్య సిబ్బందికి సూచించారు. 365పడకల ఆసుపత్రి అయిన తరు వాత ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగిందని, వారికి వైద్యం అందించడంలో సిబ్బం ది నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. అనంతరం ఆసుపత్రిలో కలెక్టర్ నిధులతో మరమ్మతులు జరుగుతున్న లేబర్ రూం, ఎంఐసీయూ, రోడ్డు నిర్మాణ పనులను, కంటి ఆపరేషన్ థియేటర్‌ను కలెక్టర్ పరిశీలించారు. పనులను వేగవం తం చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. నూతనంగా నర్సింగ్ కళాశాల కోసం ప్రతిపాదించిన భవనాలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట గైనకాలజిస్ట్ హెచ్‌వోడీ అరుణ, ఆర్‌ఎంవో అప్పారావు ఉన్నారు.