ప్రశాంతంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష
ABN , Publish Date - Jun 10 , 2024 | 12:42 AM
జగిత్యాల జిల్లాలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహిం చామని కలెక్టర్ యాస్మిన్ బాషా తెలిపారు. జిల్లా కేంద్రంలోని పలు గ్రూప్1 పరీక్ష కేంద్రాలను ఆకస్మింగా తనిఖీ చేశారు.
- జిల్లా వ్యాప్తంగా 1,635 మంది గైర్హాజరు
- నిమిషం నిబంధనతో జిల్లాలో వెనుదిరిగిన విద్యార్థులు
- పరీక్ష కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్
జగిత్యాల అర్బన్, జూన్ 9: జగిత్యాల జిల్లాలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహిం చామని కలెక్టర్ యాస్మిన్ బాషా తెలిపారు. జిల్లా కేంద్రంలోని పలు గ్రూప్1 పరీక్ష కేంద్రాలను ఆకస్మింగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 22 సెంటర్లు ఏర్పాటు చేశామని, సుమారు 7,692 మంది పరీక్ష రాయాల్సిఉండగా, 6,057 మంది పరీక్షలు రాసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,635 మంది పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. నిమిషం నిబంధన కారణంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎనిమిది మంది అభ్యర్థులు వెనుదిరిగి వెళ్లారు. ఉదయం 9గం టల నుంచి 10గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి తనిఖీలు నిర్వహించి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించగా, 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆర్టీసీ అధికారులు వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సులు నడపగా, విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. కలెక్టర్ యాస్మిన్ బాషా ధరూర్‌లో గల మౌంట్ కార్మెల్, మానస, నలంద డిగ్రీ కళాశాల, ఎస్‌కేఎన్‌ఆర్ ప్రభు త్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రా లను సందర్శించారు. ఆమె వెంట జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. పొలాస, జేఎన్టీయూ కొండగట్టు, సూర్య గ్లోబల్ స్కూల్ పరీక్ష కేంద్రాలను సందర్శించి, పరీక్ష తీరును పర్యవేక్షించారు. ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ పరీక్ష నిర్వహణలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసి, స్థానిక ఎస్‌కేఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలను సందర్శించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశామని, ఎలాంటి అవాంతరాలు లేకుండా గట్టి బందోబస్తు నడుమ పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసిందన్నారు. ఆయన వెంట ఆదనపు ఎస్పీ వినోద్‌కుమార్, డీఎస్పీ రఘుచందర్, టౌన్ ఇన్స్‌పెక్టర్ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.
ఫ టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో జగిత్యాలలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో భాగంగా ఓ సెంటర్‌లో పరీక్ష రాసిన కొందరు అభ్యర్థులు ఇన్విజి లేటర్ నిర్లక్ష్యంగా కారణంగా తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష అనంతరం అభ్యర్థులు మాట్లాడుతూ రూం నంబర్ 213లో సుమారు 24 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవగా, చివరి అరగంట ఉండగానే లాస్ట్ ఐదు నిమిషాలు అని ఇన్విజిలేటర్ పేర్కొంటూ తమను మిస్‌గైడ్ చేశాడని అభ్యర్థులు ఆరోపించారు. ఇన్విజిలేటర్ నిర్లక్ష్యం కార ణంగా ఆదరాబాదరాగా సమయం లేదన్న ఆలోచనతో ప్రశ్నలు చూడకుం డానే కొన్నింటికి ఆన్సర్‌లు బబ్లింగ్ చేశామన్నారు. బబ్లింగ్ పూర్తయ్యాక సుమారు 25 నిమిషాలు తమను రూంలోనే కూర్చోబెట్టారని వాపోయా రు. ఇదే విషయాన్ని సెంటర్‌లో ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్తే సమ స్య ఉంటే లీగల్ ప్రోసీడ్ అవ్వాలని సమాధానం ఇచ్చారని ఆరోపించారు.