ప్రశాంతంగా గ్రూప్-3 పరీక్షలు
ABN , Publish Date - Nov 18 , 2024 | 01:02 AM
జిల్లా వ్యాప్తంగా ఆదివారం తొలిరోజు గ్రూప్-3 పరీక్షలు ప్రశాం తంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇందులో జగిత్యాలలో 22, కోరుట్లలో 8, జగి త్యాలరూరల్ మండలం జాబితాపూర్‌లో ఒకటి, మల్యాల మండలం రామ న్నపేటలో ఒకటి, కొడిమ్యాల మండలం జెఎన్‌టీయూలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
సకాలంలో చేరుకోలేక
అవకాశం కోల్పోయిన పలువురు
పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నిర్వహణ
కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
జగిత్యాల, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఆదివారం తొలిరోజు గ్రూప్-3 పరీక్షలు ప్రశాం తంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇందులో జగిత్యాలలో 22, కోరుట్లలో 8, జగి త్యాలరూరల్ మండలం జాబితాపూర్‌లో ఒకటి, మల్యాల మండలం రామ న్నపేటలో ఒకటి, కొడిమ్యాల మండలం జెఎన్‌టీయూలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను నిర్వహిం చారు. జిల్లా వ్యాప్తంగా రెండు పేపర్లు కలిపి 10,656 మంది అభ్యర్థులకు గాను 5,563 మంది హాజరుకాగా, 5,093 మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యా ప్తంగా 52.21 శాతం మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందు లో పేపర్-1 పరీక్షకు 10,656 మందికి గాను 5,563 మంది హాజరు, 5,093 మంది అభ్యర్థులు గైర్హాజరు కాగా 52.21 శాతం హాజరు జరిగింది. పేపర్ -2 పరీక్షకు 10,656 మందికి గానూ 5,544 మంది హాజరు, 5,112 మంది అభ్యర్థులు గైర్హాజరు కాగా 52.03 శాతం హాజరు జరిగింది. జిల్లా వ్యాప్తంగా ముగ్గురు అభ్యర్థులు కేంద్రాలకు ఆలస్యంగా చేరుకోవడం వల్ల పరీక్ష రా యకుండానే వెనుదిరిగారు. జిల్లా కేంద్రంలో ఎన్‌ఎస్‌వీ డిగ్రీ కళాశాల, ఎస్‌కే ఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల, నలంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రా లలో పరీక్షల నిర్వహణ తీరును కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించారు. పో లీసులు బందోబస్తు నిర్వహించారు.
పరీక్ష కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
జగిత్యాల అర్భన్, నవంబర్ 17 (ఆంధ్రజ్యోతి) జిల్లాలో గ్రూప్-3 పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఆదివారం పట్టణంలోని ఎన్‌ఎస్వీ, నలంఽధ, ఎస్‌కెఎన్‌ఆర్ డీగ్రీ కళాశాలల్లో జరుతున్న పరీక్షలను సం దర్శించి, తనిఖీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకబ్బందీగా పరీక్షలు నిర్వహిం చేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
ఫముగ్గురు అభ్యర్థులు ఆలస్యంగా పరీక్షకు రావడంతో పోలీసులు అను మతించలేదు దీంతో ఆ ముగ్గురు పరీక్షకు దూరం అయ్యారు. పట్టణంలోని పభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి రెండు ని మిషాలు ఆలస్యంగా వచ్చిన జిల్లాలోని మట్‌పల్లి పట్టణానికి చెందిన భూ మేశ్వర్, రవీంధర్‌లను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. అలాగే ప్రభు త్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రానికి నాలుగు నిమిషాలు ఆలస్యంగా చేరుకున్న రవళి అనే అభ్యర్థిని పోలీసులు లోపలికి అనుమతించలేదు.
జేఎన్‌టీయులో ఆలస్యంగా వచ్చి వెనుదిరిగి..
కొడిమ్యాల : మండలంలోని నాచుపల్లి జేఎన్‌టీయు ఇంజనీరింగ్ కళా శాలలో గ్రూప్ 3 పరీక్షలు మొదటి రోజు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. జేఎన్‌టీయులో రెండు పరీక్షా కేంద్రాలలో మొదటి సెంటర్‌లో 608 మంది అభ్యర్థులకు గాను 221 మంది, రెండవ సెంటర్‌లో 600 మందికి గాను 225 మంది అభ్యర్థులు హాజరైనట్లు పరీక్షల చీప్ సూపరిండెంట్లు ఎస్. జగదీష్ కుమార్, సంగీత తెలిపారు. రెండు కేంద్రాలలో 1208 మంది అభ్యర్థులకు గాను 762 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. నిర్ణీత సమయం 9గంటల 30 నిమిషాల తర్వాత 10 మంది అభ్యర్థులు రెండు, మూడు ని మిషాలు ఆలస్యంగా కేంద్రానికి రాగా వారిని అఽధికారులు లోనికి అనుమ తించలేదు. మల్యాల సీఐ నీలం రవి ఆధ్వర్యంలో కొడిమ్యాల ఎస్సై సందీప్, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
కోరుట్ల : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్ష మెదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. పట్టణంలోని 8 పరీక్ష కేంద్రాలలో అధికారు పరీక్ష లను ప్రశాంతంగా నిర్వహించారు. పట్టణంలో పలు పరీక్ష కేంద్రాలకు న లుగురు ఆలస్యంగా రావడంలో అఽధికారులు అనుమతించ లేదు. పట్టణం లోని కోత్త బస్టాండ్, నందీ చౌరస్తా ప్రాంతాలలో మెట్‌పల్లి డీఎస్‌పీ అడ్డురి రాములు ఆధ్వ ర్యంలో హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేశారు. పట్టణంలోని వి విధ పాఠశాలలకు చెందిన ఎన్‌సీసీ క్యాడర్ విద్యార్థు లు, పోలీసులు సేవలలో పాల్గొన్నారు. పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను తహసిల్దార్ కిషన్ పరిశీలలించారు.
ఫగ్రూప్-3 పరీక్షకు 9 నెలల గర్భిణి పరీక్షకు హాజరైంది. జిల్లా కేంద్రానికి చెందిన రీనా అనే మహిళ కథలా పూర్ మండలంలో ఓ గ్రామ పంచాతీలో కార్యదర్శిగా పని చేస్తోంది. కొన్ని నెలలు సెలవులో ఉండి గ్రూప్-3 ప రీక్ష కోసం సన్నద్ధమైనా రీనా కోరుట్లలో పరీక్షకు హాజరైయింది.
మల్యాల: మల్యాల క్రాస్ రోడ్డు వద్ద గల అల్పోర్స్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 288మంది అభ్య ర్థులకు గాను 100మంది మాత్రమే హాజర య్యారు. మల్యాల సీఐ నీలం రవి, ఎస్సై నరేశ్‌కుమార్ ఇతర అధికారులు పర్యవేక్షించారు.