ఖనిలో బీజేపీ నాయకుల సంబరాలు
ABN , Publish Date - Nov 24 , 2024 | 12:52 AM
మహారాష్ట్రలో బీజేపీ అఖండ విజయం సాధించడంపై శనివారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బీజేపీ రామగుండం ఇన్చార్జి కందుల సంధ్యా రాణి, రాష్ట్ర నాయకులు మేరుగు హన్మంతుగౌడ్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.
కళ్యాణ్‌నగర్, నవంబరు 23 (ఆంధ్ర జ్యోతి): మహారాష్ట్రలో బీజేపీ అఖండ విజయం సాధించడంపై శనివారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బీజేపీ రామగుండం ఇన్చార్జి కందుల సంధ్యా రాణి, రాష్ట్ర నాయకులు మేరుగు హన్మంతుగౌడ్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహారాష్ట్రలో బీజేపీ గెలుపు ప్రజల విశ్వాసానికి నిదర్శనమని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో పెరిగిన అభివృద్ధి ఫలితంగానే మహారాష్ట్రలో భారీ మెజార్టీ సాధించడం జరిగిందన్నారు. ఈ విజయం ప్రతి ఒక్క కార్యకర్తదని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో కాషాయం జెండా ఎగురవే యడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పిడుగు కృష్ణ, జనగామ భూమయ్య, కోడూరి రమేష్, కోమళ్ల మహేష్, క్యాతం వెంకటరమణ, తడగొండ నర్సయ్య, మామిడి వీరేశ్, మచ్చ విశ్వాస్ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల రాజేందర్ ఆధ్వర్యం లో చౌరస్తాలో బాణాసంచా కాల్చి మిఠాయిలను పంపిణీ చేశారు. బీజేపీ మహారాష్ట్రలో భారీ విజయం సాధించిందని, రాబోయే ఎన్నికల్లో కూడా దేశంలో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మామిడి రాజేష్, గాలిపెల్లి తిరుపతి, సంపత్, వేణు, వట్లూరి రాము పాల్గొన్నా రు. బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యు రాలు సోమారపు లావణ్య ఆధ్వర్యంలో చౌరస్తాలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్, సునీల్ పాల్గొన్నారు.