Share News

అమర వీరుల త్యాగం చిరస్మరణీయం

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:46 PM

ప్రజల కోసం అమరులైన నాయకుల త్యాగాలు చిరస్మరణీయమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆన్నారు. ఆదివారం మండలంలోని ఇందుర్తి, గునుకులపల్లి, చిగురుమామిడి, గాగిరెడ్డిపల్లి, నవాబుపేట, సుందరగిరి, రేకొండ, రామంచ, ఓగులాపూర్‌, బొమ్మనపల్లికి చెందిన అమర వీరుల స్తూపాల వద్ద పార్టీ జెండాలను ఆవిష్కరించారు.

అమర వీరుల త్యాగం చిరస్మరణీయం

చిగురుమామిడి,సెప్టంబరు 15: ప్రజల కోసం అమరులైన నాయకుల త్యాగాలు చిరస్మరణీయమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆన్నారు. ఆదివారం మండలంలోని ఇందుర్తి, గునుకులపల్లి, చిగురుమామిడి, గాగిరెడ్డిపల్లి, నవాబుపేట, సుందరగిరి, రేకొండ, రామంచ, ఓగులాపూర్‌, బొమ్మనపల్లికి చెందిన అమర వీరుల స్తూపాల వద్ద పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అమరులకు నివాళుర్పించి ర్యాలీ నిర్వహించినారు. అనంతరం గునుకులపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణా సాయుధ పోరాటం లేకుంటే హైదరాబాద్‌ మనకు దక్కేది కాదన్నారు. నాటి రజాకార్లను తరిమికొట్టి పేద ప్రజలను వెట్టి చాకిరి నుంచి విముక్తి చేసి 4,500 మంది అమరుల త్యాగ ఫలితమే నేటి హైదారాబాద్‌ అని అన్నారు. పేద ప్రజలు ఉన్నంతవరకు ఎర్ర జెండా పార్టీలు ఉంటాయన్నారు. పాలక ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలను ఎంత అణిచివేసినా అంతకు రెట్టింపుగా ఎగిసి పడుతాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి నాగెళ్లి లక్ష్మారెడ్డి, నాయకులు అందె స్వామి, చాడ శ్రీధర్‌రెడ్డి, బూడిద సదాశివ, కూన లేనిన్‌, శోబారాణి, చిన్న స్వామి, గూడెం లక్ష్మి, బోయిని అశోక్‌, ఉస్మాన్‌ పాషా, రాకం అంజవ్వ, ముద్రకోల రాజయ్య, శారద, జంపయ్య, యాకుబ్‌ అలీ, ఇల్లందుల రాజయ్య, కాంతల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:47 PM