Share News

గోదావరిఖనిలో సీఐటీయూ నిరసన

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:22 AM

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్‌ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం గోదావరిఖని మెయి న్‌ చౌరస్తాలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

గోదావరిఖనిలో సీఐటీయూ నిరసన

కళ్యాణ్‌నగర్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్‌ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం గోదావరిఖని మెయి న్‌ చౌరస్తాలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌ మాట్లాడు తూ అంబేద్కర్‌ను అగౌరవ పరిచే విధంగా పార్లమెంట్‌లో మనువాదం కాదు మానవతావా దం ఉండాలన్నారు. జీవితాంతం పోరాడిన రా జ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను అవ మావించే విధంగా పార్లమెంట్‌లో అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చె ప్పారు. అమిత్‌షా వ్యాఖ్యలకు బేషరతుగా క్షమా పణ చెప్పాలని, అమిత్‌షాను ప్రధాని నరేంద్ర మోదీ వెనుకేసుకురావడం దుర్మార్గమన్నారు. అమిత్‌షాను మంత్రి పదవి నుంచి తొలగించి పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీజేపీ నగ్న స్వరూపాన్ని దేశ ప్రజలు, సామాజిక ఉద్యమకారులు అర్థం చేసు కుని దేశంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకికతత్వాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. మనువాద సిద్ధాంతాన్ని మట్టికరిపించే విధంగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిర సన శ్రామిక భవన్‌ నుంచి చౌరస్తా వరకు కొన సాగింది. ఈ కార్యక్రమంలో వేల్పుల కుమారస్వా మి, ఎరవెల్లి ముత్యం రావు, మెండె శ్రీనివాస్‌, బిక్షపతి, రామాచారి, జ్యోతి, రవీందర్‌, నర్సయ్య, నారాయణ, శివరాంరెడ్డి, దుర్గాప్రసాద్‌, జనార్ధన్‌, శ్రీనివాస్‌, శ్రావణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 12:22 AM