Share News

నేటి నుంచి సీఎం కప్‌ క్రీడలు

ABN , Publish Date - Dec 06 , 2024 | 11:46 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్‌ క్రీడా పోటీలకు కరీంనగర్‌ ముస్తాబైంది. ఉమ్మడి జిల్లాస్థాయిలో నిర్వహించనున్న పోటీలకు జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

నేటి నుంచి సీఎం కప్‌ క్రీడలు

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, డిసెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్‌ క్రీడా పోటీలకు కరీంనగర్‌ ముస్తాబైంది. ఉమ్మడి జిల్లాస్థాయిలో నిర్వహించనున్న పోటీలకు జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పోటీల్లో పాల్గొనాలనుకునే ఔత్సాహిక క్రీడాకారులు ముందుగా తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనే ఆంక్షలతో నామమాత్ర స్పందన వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శనివారం నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్రీడలు ప్రారంభమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని వివిధ మండలాల్లో గల గ్రామాల్లో గ్రామ కార్యదర్శులు ఏర్పాట్లను పూర్తి చేశారు. గ్రామస్థాయి యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారిని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లు పూర్తి అయినప్పటికీ క్రీడల్లో పాల్గొనే యువత రిజిస్ర్టేషన్‌ చేసుకోవడంలో ఇబ్బందికి గురవుతున్నారు. గ్రామస్థాయిలో ప్రతిభచాటిన క్రీడాకారులను ఈ నెల 10, 11, 12 తేదీల్లో మండలస్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపిక చేయనున్నారు. జిల్లాస్థాయిలో నిర్వహించనున్న పోటీలకు మండల స్థాయిలో ప్రతిభచాటే క్రీడాకారులను జిల్లాస్థాయికి ఎంపిక చేస్తారు. జిల్లాస్థాయిలో 20 క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించి అక్కడ ప్రతిభ చాటే క్రీడాకారులను రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపిక చేయనున్నారు.

Updated Date - Dec 06 , 2024 | 11:46 PM