Share News

కోల్‌ ఇండియా స్థాయిలో రాణించాలి..

ABN , Publish Date - Oct 24 , 2024 | 12:53 AM

కోలిండియా స్థాయిలో సింగరేణి క్రీడాకారులు రాణించాలని ఆర్‌జీ-1 డి.లలిత్‌కుమార్‌ ఆకాంక్షిం చారు.

కోల్‌ ఇండియా స్థాయిలో రాణించాలి..

గోదావరిఖని, అక్టోబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): కోలిండియా స్థాయిలో సింగరేణి క్రీడాకారులు రాణించాలని ఆర్‌జీ-1 డి.లలిత్‌కుమార్‌ ఆకాంక్షిం చారు. గత రెండురోజులుగా వర్క్‌ పీపుల్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక జవహర్‌లాల్‌ నెహ్రు స్టేడియంలో జరుగుతున్న కంపెనీస్థాయి కబడ్డీ, బాల్‌బ్యాడ్మింటన్‌ 2024-25 వార్షిక క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీఎం క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. క్రీడాకారులు క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపర్చుకొని మెలకువలతో ఆటలు ఆడాల న్నారు. అప్పుడే విజయం సాధించడం జరుగు తుందన్నారు. క్రీడలు జీవితంలో ఎదుగుదలకు ఆత్మస్థైర్యానికి దోహదపడతాయని క్రీడా స్పూర్తి తో క్రీడాకారులు ముందుకు సాగాలన్నారు. కంపెనీ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను కోలిండియాలో జరిగే పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. కోలిండియాలో ప్రతిభ కన బర్చి సింగరేణి సంస్థ ఘనతను మరోమారు చాటిచెప్పాలన్నారు. పోటీల్లో గెలిచిన జట్లకు జీఎం లలిత్‌కుమార్‌తో పాటు ఖని ఏసీపీ రమే ష్‌ బహుమతులు అందజేశారు. బాల్‌బ్యాడ్మిం టన్‌ పోటీల్లో బెల్లంపల్లి, మందమర్రి జట్టు ప్రథ మ స్థానంలో, శ్రీరాంపూర్‌ జట్టు ద్వితీయ స్థానం లో నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు కే స్వామి, అధికారుల సంఘం ప్రతి నిధి క్రాంతి, ఎస్వోటూ జీఎం రామ్మోహన్‌, పర్స నల్‌ మేనేజర్‌ కిరణ్‌బాబు తోపాటు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2024 | 12:53 AM