Share News

సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:35 AM

తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి
సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీబావం తెలుపుతున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు

సుభాష్‌నగర్‌/కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. సమ్మె శిబిరాన్ని వారు ఆదివారం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ టీచర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మణిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహస్వామి, పీఆర్టీయూ టీఎస్‌ టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి, పీఆర్టీయూ టీఎస్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు ముస్కు తిరుపతిరెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కరుణాకర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, తెలంగాణ సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్‌ యాదగిరి, టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పోలు సత్యనారాయణ, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు బెజ్జంకి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు గుండా రాజిరెడ్డి, ప్రధానకార్యదర్శి మహేశ్‌, ఉపాధ్యక్షులు రమేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 12:35 AM