సొంతింటి పథకం అమలుచేయాలని ఆందోళన
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:23 AM
సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథ కం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీ యూ తలపెట్టిన ఆందోళనల్లో భాగంగా గురువా రం ఆర్జీ-2 వర్క్‌షాప్‌లో సంతకాల సేకరణ చేప ట్టారు.
యైుటింక్లయిన్‌కాలనీ, డిసెంబరు 26 (ఆంధ్ర జ్యోతి): సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథ కం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీ యూ తలపెట్టిన ఆందోళనల్లో భాగంగా గురువా రం ఆర్జీ-2 వర్క్‌షాప్‌లో సంతకాల సేకరణ చేప ట్టారు. ఈసందర్భంగా ఆర్జీ-2 బ్రాంచి సెక్రెటరీ కుం ట ప్రవీణ్ మాట్లాడారు. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నాయకులు గెలిచిన తర్వాత విస్మరించారని తెలి పారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో అన్ని కార్మిక సంఘాలు సొంత ఇంటి పథకం అమలు చేయిస్తా మని హామీ ఇచ్చాయని, ఇటీవల జరిగిన స్ట్రక్చర్ సమావే శాల్లో గెలిచిన సంఘాలు ప్రస్తావించకపోవడం కార్మికుల ను నిరాశపరిచినట్టు ప్రవీణ్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక సమ స్యలను పరిష్కరించేలా సింగ రేణి యాజమాన్యం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అమలుచేయించే బాధ్యత గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలపై ఉన్నదని ప్రవీణ్ తెలిపారు. ఐక్య పోరాటాల ద్వారానే సొంత ఇంటి పథకం అమలు, పెర్క్స్‌మీద ఐటీ రీయింబర్స్, మారుపేర్ల మార్పిడి వంటివి పరిష్కారం అవుతాయన్నారు. ఐక్య పోరాటాలకు సీఐటీయూ సిద్ధమని తెలిపారు. ఈసందర్భంగా డిమాండ్ల తో కూడిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎస్ వెంకన్న, నాయకులు వినేష్, రాజేష్, తిరుపతి, శ్రావణ్, సంతోష్, కార్మికులు పాల్గొన్నారు.