Share News

కార్పొరేట్‌ వల

ABN , Publish Date - Mar 29 , 2024 | 01:45 AM

హలో సర్‌...మీ అమ్మాయి పదో తరగతిలో మంచి మార్కులు సాధిస్తుందని తెలుసుకున్నాము...మీ అమ్మా యి బాగా చదువుతుందని ముందు నుంచే విన్నాం.. మా కళాశాలలో నాణ్యమైన బోధన ఉంటుంది. మంచి మార్కులు వచ్చే విద్యార్థులకు ఫీజు లో రాయితీ ఇస్తాం...ఒకసారి మా కాలేజీకి వచ్చి చూడండి...కేవలం ముం దస్తు అడ్మిషన్‌ ఫీజు చెల్లిస్తే చాలు...అంటూ ప్రైవేటు, కార్పొరేటు కళాశా లల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌కాల్స్‌ చేస్తూ అడ్మిష న్ల వల విసురుతున్నారు.

కార్పొరేట్‌ వల

- ఇంటర్‌ ప్రవేశాలకు ఫోన్‌ కాల్స్‌

- ప్రైవేటు కళాశాల యాజమాన్యాల పోటీ

- రంగంలోని పీఆర్‌వోలు

- ‘పది’ పరీక్షలు పూర్తికాకముందే తల్లిదండ్రులతో ఒప్పందాలు

- జోరుగా అడిష్మన్ల వ్యాపారం

జగిత్యాల, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): హలో సర్‌...మీ అమ్మాయి పదో తరగతిలో మంచి మార్కులు సాధిస్తుందని తెలుసుకున్నాము...మీ అమ్మా యి బాగా చదువుతుందని ముందు నుంచే విన్నాం.. మా కళాశాలలో నాణ్యమైన బోధన ఉంటుంది. మంచి మార్కులు వచ్చే విద్యార్థులకు ఫీజు లో రాయితీ ఇస్తాం...ఒకసారి మా కాలేజీకి వచ్చి చూడండి...కేవలం ముం దస్తు అడ్మిషన్‌ ఫీజు చెల్లిస్తే చాలు...అంటూ ప్రైవేటు, కార్పొరేటు కళాశా లల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌కాల్స్‌ చేస్తూ అడ్మిష న్ల వల విసురుతున్నారు. అందుకు ఏమాత్రం తగ్గకుండా ప్రైవేటు కళా శాలలు తమ దగ్గర ఉన్న సౌకర్యాలు, లేని సౌకర్యాలు, తోక పేర్లను జోడిం చి తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. జిల్లాలో ప్రైవే టు కళాశాలల యాజమాన్యాలు చేస్తున్న అడ్మిషన్ల ప్రచారం అంతా ఇంతా కాదు.. పదో తరగతి విద్యార్థులను చేర్చుకునేందుకు ఇంటర్‌ కార్పొ రేట్‌, ప్రైవేటు కళాశాలలు రంగంలోకి దిగాయి. కళాశాలల పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్స్‌ (పీఆర్‌ఓలు) అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తున్నారు. ప్రవేశాలకు ముందస్తుగా తల్లిదండ్రులతో ఒప్పందాలు చేయించుకుంటున్నారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి పట్టణాలతో పాటు పలు మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతా ల్లో ఎన్నికల ప్రచారాన్ని తలపించే విధంగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అడ్మిష న్ల వ్యాపారం చేస్తున్నారు. పేరు మోసిన తమ కళాశాలల్లో సీట్లు దొరకవ ని త్వరపడాలని ప్రచారం చేస్తూ ఆందోళనకు గురిచేస్తున్నారు. ముందుగా అడ్మిషన్‌ బుక్‌ చేసుకుంటే ఫీజు రాయితీ ఉంటుందని మాయ మాటలతో నమ్మిస్తున్నారు. ముందుగానే సీటు రిజర్వ్‌ చేసుకోకపోతే కోరిన బ్రాంచ్‌లో సీటు దొరకదని బెదరకొడుతున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు హైద్రాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, విజయవాడ, గుంటూరు వంటి ప ట్టణాల్లో పేరు మోసిన కార్పొరేట్‌ కాలేజీల్లో ముందస్తు అడిష్మన్లు పొందుతున్నారు.

పరీక్షలు కాకముందే..

పదో తరగతి వార్షిక పరీక్షలు పూర్తి కాకముందే కళాశాలల్లో ప్రవేశాల కు ముందస్తు బుకింగ్‌లు జరుగుతున్నాయి. జిల్లాలో 11,366 మంది వి ద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రైవేటుగా పదో తర గతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు 841 మంది ఉన్నారు. విద్యార్థుల అడ్ర స్‌లు, ఫోన్‌ నంబర్లు కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు, కన్సల్టెన్సీలు, పీఆర్‌ఓలకు చేరాయి. అయితే పలు ప్రాంతాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ కళాశాలల అద్యాపకులు సైతం పీఆర్‌వోలుగా వ్యవహరిస్తున్నార న్న ఆరోపణలున్నాయి. గత యేడాది రెగ్యులరైజ్‌ అయినా పలువురు లెక్చరర్లు సైతం పీఆర్‌ఓలుగా వ్యవహరిస్తూ కమీషన్లు దండుకుంటున్నట్లు విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో పరీ క్షలతో సంబంధంగా లేకుండా సీట్ల కోసం ముందస్తు బుకింగ్‌లు జరుపు తున్నారు. ముందస్తుగా బుక్‌ చేస్తే పీఆర్‌వోలకు కమీషన్లు లభిస్తుండ డంతో పీఆర్‌వోలు తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఒక్కో విద్యా ర్థిపై రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు కమీషన్‌ అందుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంటర్‌ అడ్మిషన్లకు ఎల్‌ఐసీ ఏజంట్లు, ప్రభుత్వ, ప్రై వే టు ఉపాధ్యాయులు, ఆర్‌ఎంపీలను సైతం రంగంలోకి దింపి ఒక్కో విద్యా ర్థితో యాజమాన్యం నిర్ణయించిన ఫీజు కట్టిస్తే పది శాతం డబ్బులు ము ట్టజెప్పేందుకు పీఆర్‌ఓలతో కార్పొరేట్‌, ప్రైవేటు కళాశాలలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆఫర్లపై ఆఫర్లు...

జిల్లాల్లో ప్రైవేటు కళాశాలలు అడ్మిషన్ల కోసం ఎత్తులకు పైఎత్తులు వే స్తున్నాయి. గత ఏడాది విద్యార్థులు సాధించిన మార్కులు, ప్రస్తుత వి ద్యాసంవత్సరంలో విజయ అవకాశాలతో రంగురంగుల బ్రోచర్లను రూపొం దించి విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక కళాశాలకు దీటుగా మరో కళాశాల విభిన్నంగా ఉండేలా ప్రచారం చే స్తున్నాయి. ఉన్నవి, లేనివి చూపిస్తూ అడ్మిషన్ల కోసం ప్రయత్నిస్తున్నా యి. కళాశాలల్లో పీఆర్‌వోలను ఏర్పాటు చేసుకొని గ్రామాల వారీగా షె డ్యూల్‌తో అడ్మిషన్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయోమయంలో తల్లిదండ్రులు...

పది పరీక్షలు రాసి మంచి మార్కులు సాధిస్తారనుకొని అంచనాలున్న విద్యార్థుల తల్లిదండులు ప్రైవేటు కళాశాలల సిబ్బంది చేసే ఫోన్‌ కాల్స్‌తో విసుగు చెందుతున్నారు. ఒకవేళ ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోతే కార్లు వేసుకుని ఇళ్ల వద్ద వాలిపోతుండడంతో తల్లిదండ్రులు అయోమయానికి గురవుతు న్నారు. పేరుకే వేసవి సెలవులు అయినప్పటికీ ప్రైవేటు విద్యా సంస్థలో అడ్మిషన్ల ప్రక్రియ అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. కళాశాలలో పని చేస్తున్న సిబ్బందికి టార్గెట్లు ఇచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకూ వీధుల్లో తిప్పుతున్నారు. తమ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఏ ఊరి వారో చూసుకుని ఆ ఊరిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పది పరీక్షలు రాసిన విద్యార్థుల అడ్రస్సు తీసుకుని వారి ఇళ్లకు వెళుతు న్నారు. ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఏ సామాజిక వర్గానికి చెందిన వారు, ఎవరితో చెబితే మాట వింటారో ముందుగానే ఒక అవగాహన వచ్చి వారి తో కలిసి అడ్మిషన్ల కోసం ఒత్తిళ్లు తెస్తున్నారు.

కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు ధారాదత్తం

ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నూ తన జాతీయ విద్యా విదానం 2020ను దేశంలో అమలు చేయడం కోసం మానవ వనరుల శాఖ రాష్ట్రాల అధికారాలను, ఫెడరల్‌ హక్కులను హరి స్తూ దేశవ్యాప్తంగా ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలలో కార్పొరేట్‌ పెట్టు బడిదారులకు విద్యారంగాన్ని ధారాదత్తం చేస్తోందని విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. విద్యార్థుల మేధా శక్తి ద్వారా విచ్చల విడిగా వ్యా పారం చేస్తోందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికా రులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

అప్రమత్తతే ప్రధానం..

తల్లిదండ్రులు తొందరపడి పిల్లల భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కసారి కాలేజీలో చేరితే ఎవ్వరూ పట్టిం చుకోరని పేర్కొంటున్నారు. కార్పొరేట్‌ కళశాలల్లో చేర్పించే ముందు పిల్లల అభిప్రాయాలతో పాటు సదరు కళాశాలల్లో విద్యా బోధన, వసతులు, అనుమతుల గురించి తెలుసుకోవాలని హెచ్చరిస్తున్నారు. తమ విద్యా వ్యా పారం కోసం నిత్యం పుస్తకమే ప్రపంచంగా మార్చే కళాశాలలున్నాయని, అలాంటి కళాశాలల్లో చేర్పిస్తే విద్యార్థులు ఒత్తిడికి గురై మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయని సూచిస్తున్నా రు. అందుకని తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Mar 29 , 2024 | 01:45 AM