Share News

బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Feb 14 , 2024 | 12:34 AM

రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది.

బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
బోనంతో బారులుదీరిన భక్తులు

వేములవాడ, ఫిబ్రవరి 13 : రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. మేడారం సమ్మక్కసారక్క జాతరకు వెళ్లడానికి ముందు ఆనవాయితీ ప్రకారం సోమవారం తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు మంగళవారం బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు తెల్లవారుజామునే భక్తిశ్రద్ధలతో నైవేద్యం వండి బోనం తయారుచేసి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. బద్ది పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భారీ సంఖ్యలో జనం తరలి రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటలకు పైగా సమయం పట్టింది.

Updated Date - Feb 14 , 2024 | 12:34 AM