బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Feb 21 , 2024 | 12:02 AM
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది
వేములవాడ, ఫిబ్రవరి 20 : వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు మంగళవారం బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. బద్ది పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బద్దిపోచమ్మ అమ్మవారికి బోనం చెల్లించేందుకు భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి.