బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Apr 30 , 2024 | 11:56 PM
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధగా ఉన్న బద్ది పోచమ్మ ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది.
వేములవాడ, ఏప్రిల్ 30 : వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధగా ఉన్న బద్ది పోచమ్మ ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు మంగళవారం బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామునే భక్తిశ్రద్ధలతో నైవేద్యం వండి బోనం తయారుచేసి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకొని బద్ది పోచమ్మ అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భారీ సంఖ్యలో జనం తరలి రావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.