Share News

సమగ్ర కుటుంబ సర్వేతో ప్రభుత్వ పథకాల్లో కోత విధించం

ABN , Publish Date - Nov 10 , 2024 | 12:49 AM

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో ప్రభుత్వ పథకాల్లో కోత విధించమని, ప్రజల్లో ఉండే అపోహలను తొలగించి సంపూర్ణ వివరాలు సేకరించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.

సమగ్ర కుటుంబ సర్వేతో ప్రభుత్వ పథకాల్లో కోత విధించం

పెద్దపల్లి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో ప్రభుత్వ పథకాల్లో కోత విధించమని, ప్రజల్లో ఉండే అపోహలను తొలగించి సంపూర్ణ వివరాలు సేకరించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయ వంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశిం చారు. శనివారం ఆయన సీఎస్‌ శాంతి కుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గురించి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నిర్వహణకు హౌస్‌ లిస్టింగ్‌ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు విజయ వంతంగా పూర్తి చేసినందుకు అధికార యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినం దిస్తున్నట్లు తెలిపారు. హౌస్‌ లిస్టింగ్‌ కార్యక్రమంలో వచ్చిన ఇళ్ల సంఖ్య ఆధా రంగా ప్రతి 150 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్‌, 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌లను నియమించుకొని సర్వే చేపడుతున్నామని డిప్యూటీ సీఎం తెలి పారు. 15 రోజుల పాటు నిరాటంకంగా సర్వే చేయాలని, ఒక్క కుటుంబాన్ని కూడా వదలకుండా సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు. సర్వే షెడ్యూల్‌ సంబంధించి ముందస్తుగా గ్రామాలు, వార్డుల్లో సమాచారం అందిం చాలని, ఏ సమయంలో సర్వే బృందాలు ఇళ్లకు వస్తాయో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. సర్వే సమయంలో ఇంటి వద్ద కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డు వివరాలు, రేషన్‌ కార్డు, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని డిప్యూటీ సీఎం ప్రజలను కోరారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల ఆర్థిక సామాజిక స్థితిగతులను తెలుసుకొని వారిని వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు సరైన పథకాల రూపకల్పన కోసమే ఈ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. సర్వే నిర్వహణ సమయంలో ప్రజలు ఎక్కడైనా ఎందుకు సమాచారం సేకరిస్తున్నారని అడిగితే అధికారులు వివరించాలన్నారు. ప్రతి ఎన్యూమరేటర్‌ చేసిన సర్వేలో కనీసం 10 శాతం మేర ఇళ్లను సూపర్‌వైజర్‌ క్రాస్‌ చెక్‌ చేసుకోవాలని సూచిం చారు. సర్వే వివరాలను ప్రతి రోజు ఎన్యుమరేటర్లు మండల స్థాయిలో తహసీ ల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల వద్ద అప్పగించాలని తెలిపారు. సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల అభ్యు న్నతి కోసం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను అధికారులు విజయవంతంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం కోరారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, ఆర్‌డీవోలు గంగయ్య, సురేష్‌, జిల్లా పరిషత్‌ సీఈవో నరేందర్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు ప్రకాశ్‌, సంబంధిత అధికారు లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 12:49 AM