వృద్ధులే లక్ష్యంగా సైబర్ నేరస్థుల మోసాలు
ABN , Publish Date - Nov 07 , 2024 | 12:46 AM
వృద్ధు లను టార్గెట్‌గా చేసుకొని సైబర్ నేరస్థులు మోసా లకు పాల్పడుతున్నారని రామగుండం సీపీ ఎం.శ్రీని వాస్ అన్నారు.

జ్యోతినగర్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : వృద్ధు లను టార్గెట్‌గా చేసుకొని సైబర్ నేరస్థులు మోసా లకు పాల్పడుతున్నారని రామగుండం సీపీ ఎం.శ్రీని వాస్ అన్నారు. బుధవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీ నియం హాలులో సీనియర్ సిటిజన్లకు సైబర్ క్రైం ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న సీపీ ప్రసంగిస్తూ ఇంటర్నెట్, టెక్నాలజీపై సరైన అవగాహన లేని సీనియర్ సిటిజన్లు, విశ్రాంత ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్న నేరస్థులు మోసాలు చేస్తున్నారన్నారు. విశ్రాంత ఉద్యోగులకు రిటైర్మెంట్ తరువాత పెద్ద మొత్తంలో గ్రాట్యుటీ ఇతరత్రా సొమ్ము వారి ఖాతాల్లో ఉంటాయని, పెద్ద మొత్తంలో పెన్షన్లు రిటైర్ ఉద్యోగులే పొందుతారనే వారిపైనే దృష్టి పెట్టారని పేర్కొన్నారు. తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ వస్తే సమాచారం ఇవ్వవద్దన్నారు. అన్‌నోన్ వీడియో కాల్స్‌ను ఎత్తవద్దని, అధిక మొత్తం డబ్బు ఇస్తామని చెప్పే మాటలను నమ్మవద్దని కోరారు. ఈ విష యంలో సరైన అవగాహన ఉండాలని, మోసపోతే వెంటనే 1930కు ఫోన్ చేయాలన్నారు. సైబర్ నేరాలకు గురికాకుండా ఉండడానికి అవసరమైన పలు సూచనలు, జాగ్రత్తలను, సాంకేతిక అంశాలను సైబర్ క్రైం ఏసీపీ వెంకట రమణ సీనియర్ సిటి జన్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం.రమే ష్, రామగుండం సీఐ ప్రవీణ్‌కుమార్, సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ ద్యోగులు పాల్గొన్నారు.