పట్టాలు తప్పిన గూడ్సు రైలు
ABN , Publish Date - Jun 04 , 2024 | 11:40 PM
పెద్దపల్లి మండలంలోని రాఘవ పూర్ రైల్వేస్టేషన్ శివారులో మంగళవారం గూడ్సు రైలు పట్టాలు తప్పిన సంఘటన చోటు చేసుకుంది.
పెద్దపల్లి రూరల్, జూన్ 4: పెద్దపల్లి మండలంలోని రాఘవ పూర్ రైల్వేస్టేషన్ శివారులో మంగళవారం గూడ్సు రైలు పట్టాలు తప్పిన సంఘటన చోటు చేసుకుంది. రైల్వే అధికారుల వివరాల ప్రకారం.. కేశోరాం సిమెంట్ కర్మాగారం నుంచి మహారాష్ట్రకు సి మెంట్ లోడ్‌తో వెళ్తున్న గూడ్సు రైలు రాఘవపూర్ రైల్వేస్టేషన్ దాటిన తరువాత ఒక వ్యాగన్ పట్టాలు తప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తక్షణమే రైల్వే ప్రత్యేక వాహనాన్ని తీసు కొచ్చి పట్టా నుంచి తప్పిన వ్యాగన్‌ను మరమ్మతులు చేపట్టారు. గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో 30నిమిషాల పాటు అంతరా యం ఏర్పడిందని తెలిపారు. తిరిగి యథావిధిగా గూడ్సు రైలు మహారాష్ట్రకు వెళ్లినట్లు తెలిపారు.