Share News

ఖని బస్‌ డిపో ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా

ABN , Publish Date - Nov 20 , 2024 | 12:33 AM

ఆర్‌టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించాలని, కార్మిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఖని బస్‌ డిపో ఎదుట ధర్నా నిర్వహిం చారు.

ఖని బస్‌ డిపో ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా

కళ్యాణ్‌నగర్‌, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ఆర్‌టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించాలని, కార్మిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఖని బస్‌ డిపో ఎదుట ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమార స్వామి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్‌టీసీ కార్మికుల ఐక్యతను దెబ్బతీయ డానికి కార్మిక సంఘాలను రద్దుచేశారని, కార్మికులు ప్రశ్నించకుండా ఉండటా నికే ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందని ఆరోపించారు. ఈ అవకాశాన్ని ఉపయోగిం చుకుని డిపో మేనేజర్‌ నుంచి పై అధికారుల వరకు కార్మికులపై పని గంటలు, పని భారం మోపుతున్నారని ఆరోపించారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఒక్క రోజు సెలవు కూడా ఇవ్వడం లేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్‌ టీసీలో యూనియన్‌ కార్యకలాపాలకు అనుమతిస్తామని చెప్పి ఏడాది కావస్తు న్నా ఇంత వరకు అమలు చేయడం లేదన్నారు. ఈ ధర్నాలో నర్సయ్య, నరహరి, రంగయ్య, శివకుమార్‌, గణేష్‌, బాలకృష్ణ, సంపత్‌, దీప, మహేశ్వరి, అంజలి, మంజుర, రమ, వరలక్ష్మి, జమున, నర్సమ్మ పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 12:34 AM