బీఆర్‌ఎస్‌లో కలకలం..
ABN , Publish Date - Aug 28 , 2024 | 01:48 AM
బీఆర్‌ఎస్‌లో కలకలం రేగింది. మేయర్ యాదగిరి సునీల్‌రావు 23న అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆయన డిప్యూటీ మేయర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించకపోవడంతో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
కరీంనగర్ టౌన్, ఆగస్టు 27: బీఆర్‌ఎస్‌లో కలకలం రేగింది. మేయర్ యాదగిరి సునీల్‌రావు 23న అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆయన డిప్యూటీ మేయర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించకపోవడంతో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పాలకవర్గం ఏర్పడిన 55 నెలలుగా నగరపాలక సంస్థలో ఏనాడూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదు. త్వరలో గడువు ముగియనున్న తరుణంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం బీఆర్‌ఎస్‌లో కలకలం సృష్టించింది.
ఫ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించలేదంటూ..
ఈనెల 23న మేయర్ యాదగిరి సునీల్‌రావు తన వ్యక్తిగత కుటుంబ పనుల నిమిత్తం అమెరికాకు వెళ్తూ పదిహేను రోజుల్లో తిరిగి వస్తానంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిబంధనల మేరకు 14 రోజులపాటు ప్రజలకు అందుబాటులో లేకుండా ఇతర ప్రాంతాలకు వెళితే డిప్యూటీ మేయర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలని మున్సిపల్ చట్టంలో ఉందని, తాను బీసీ మహిళను కావడంతోనే ఇవ్వలేదని డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ విమర్శించారు. తనకు ఇన్‌చార్జి మేయర్‌గా బాధ్యతలు అప్పగించాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఫ మేయర్‌కు కలెక్టర్ నోటీసు
ఈ మేరకు కలెక్టర్ మేయర్‌కు నోటీసును జారీ చేయడం, ఆయన 15 రోజుల్లోనే అంటే సెప్టెంబరు 5న అమెరికా నుంచి బయలు దేరి 6న రాత్రి వరకు కరీంనగర్‌లో ఉంటానంటూ ఫ్లైట్ టికెట్‌ను కలెక్టర్‌కు పంపించారు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం ముగిసి పోతుందని అంతా భావించారు. మంగళవారం డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, తన భర్త, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌తోకలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి బీసీ మహిళను అయినందునే ఇన్‌చార్జి ఇవ్వకుండా తనను అగ్రవర్ణాలకు చెందిన మేయర్ తనను అవమాన పరిచారని విమర్శించారు. మేయర్ వచ్చే వరకు తాను నగరపాలనపై దృష్టిపెడతానని స్పష్టం చేశారు.
- భార్యభర్తలిద్దరికీ పార్టీ రెండు పదవువులను అప్పగించినా పదవీకాంక్షతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మేయర్ సునీల్‌రావు అమెరికా నుంచి వీడియోతోపాటు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. మున్సిపల్ చట్టంలోని నిబంధనల మేరకే విదేశీ టూర్‌కు వెళ్ళానని, మేయర్ ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వలేదంటూ తనపై ఆరోపణలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమంటూ ధ్వజమెత్తారు. మరోవైపు వారిద్దరిపై చర్య తీసుకోవాలని బీఆర్‌ఎస్ అధిష్ఠానాన్ని కోరారు. బల్దియా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలకమైన పోస్టుల్లో ఉండి విమర్శించుకోవడంతో పార్టీకి నష్టం కలుగుతుందని, ఇది ఇతర ప్రతిపక్షాలకు అవకాశమివ్వడమేనంటూ పార్టీ సీనియర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.