Share News

వేర్వేరు కాంటాలు ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:22 AM

ఈ వానాకాలంలో రైతులు సాగు చేసిన సన్న, దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేసేం దుకు కేంద్రాల్లో వేర్వేరుగా కాంటాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష అన్నారు.

వేర్వేరు కాంటాలు ఏర్పాటు చేయాలి

పెద్దపల్లి, అక్టోబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఈ వానాకాలంలో రైతులు సాగు చేసిన సన్న, దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేసేం దుకు కేంద్రాల్లో వేర్వేరుగా కాంటాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం ఆయన అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ లాల్‌తో కలిసి సంబందిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సంబంధించి జిల్లాలో పటిష్ట కార్యాచరణతో 300కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. గతానికి భిన్నంగా ఈ సీజన్‌ నుంచి సన్న రకం, దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకు వేర్వేరు కౌంటర్లు, కాంటాలు ఏర్పాటు చేయా లన్నారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన మేర గోనె సంచులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అకాల వర్షాల వల్ల ధాన్యం తడిచి పోకుండా టార్ఫాలిన్‌ కవర్లు సిద్ధం చేయాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు ధాన్యం నాణ్యత ప్రమాణాలపై రైతులలో ప్రచారం కల్పించాలని, అదే విధంగా సన్న రకం దాన్యం గుర్తింపు పక్కాగా జరిగేలా చూడాలని అన్నారు. బస్తాలలో నింపిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ప్యాడ్‌ క్లీనర్లు, తేమ యంత్రాలు, వెయింగ్‌ యంత్రాలు, అన్ని సౌకర్యాలు కల్పిం చాలని అన్నారు. తాలు, తరుగు విషయమై రైతులను ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవా లని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీవో శ్రీమాల, డీఆర్‌డీవో రవీందర్‌, పౌరసరఫరాల డీఎం శ్రీకాంత్‌, డీఎవో ప్రవీణ్‌ రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:22 AM