కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తొలగించాలి
ABN , Publish Date - Nov 21 , 2024 | 12:28 AM
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులను తొలగించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. బుధవారం కరీం నగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
కరీంనగర్, నవంబరు 20 (ఆంధ్ర జ్యోతి, ప్రతినిధి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులను తొలగించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. బుధవారం కరీం నగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులను తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 18 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 7,707 కొనుగోలు కేంద్రాల్లో 14.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. పంటను తూకం వేసిన తరువాత వెంట వెంటనే రైతుల భ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. సన్న రకాలకు క్వింటాల్‌కు 500 బోనస్ అందిస్తున్నామన్నారు. రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు పంటను అమ్ముకొని నష్టపో కుండా అవగాహన కల్పించా లన్నారు. ప్రతి రోజు కొనుగోలు కేంద్రాలను సందర్శించి సవ ుస్యలను పరిష్కరించాలన్నారు. సన్న రకం ధాన్యం గుర్తించే ందుకు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి గ్రెయిన్ కాపర్ యంత్రం అందించాలన్నారు. సన్న రకం శాంపిళ్లను డిస్‌ప్లే చేయాలన్నారు. తెలంగాణ బియ్యానికి డిమాండ్ ఉందన్నారు. సోనా, ఆర్‌ఎన్‌ఆర్ తదితర రకాల బియ్యానికి ఇతర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. మిల్లర్లకు పారదర్శకంగా ధాన్యం కేటాయిస్తున్నామన్నారు. రైతులు అందించే ధాన్యంలో కోతలు విధించకుండా చూడాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ జిల్లాలో రైతులు వానాకాలంలో 55 శాతం దొడ్డు రకం, 45 శాతం సన్న రకాలు సాగు చేశారన్నారు. ఇప్పటి వరకు 1,23,000 టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిందన్నారు. మిల్లర్లు, క్షేత్ర స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతులకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా సహకార అధికారి రామానుజాచారి, జిల్లా వ్యవసాయ అధికారి జిల్లా సివిల్ సప్లై అధికారి నర్సింగరావు, మేనేజర్ రజనీకాంత్, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఫ రైస్‌మిల్ అసోసియేషన్
సభ్యులతో సమావేశం
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మిల్లర్లు పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లారు. గన్ని సంచుల కొరత తీర్చడంతో పాటు, బాయిల్డ్ రైస్ మిల్లింగ్ ఛార్జీలు పెంచాలని కమిషనర్‌ను కోరారు.
ఫ ధాన్యంలో 17శాతం తేమ ఉండాలి
కరీంనగర్ రూరల్: ధాన్యంలో 17శాతం తేమ ఉంటేనే కాంటా పెట్టాలని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్ ఆదేశించారు. బుధవారం కరీంనగర్ మండలం నగునూర్ కొనుగోలు కేంద్రాన్ని ఆదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్‌తో కలసి తనిఖీ చేశారు. ధాన్యంలో తేమ శాతం 22 నుంచి 24 వరకు ఉందని 17 శాతం వస్తేనే కాంటా పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఓ రామానుజాచారి, డీఎస్‌ఓ నర్సింగరావు, సివిల్ సప్లై డీఎం రజినీకాంత్, కరీంనగర్ సింగిల్ విండో సీఈఓ రమేష్, డైరెక్టర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ రైతులు ధాన్యం ఆరబెట్టి తీసుకురావాలి
చొప్పదండి : రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. బుధవారం మండలంలోని రుక్మాపూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అయన తనిఖీ చేశారు. ధాన్యాన్ని పరిశీలించి రైతులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టి కేంద్రాలకు తీసుకువస్తే కొనుగోలు ప్రక్రియ తొందరగా పూర్తి అవుతుందన్నారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్, డీఎస్‌ఓ పర్సింగరావు, డీఎం రజినికాంత్ , డీసీఓ రామానుజచార్య , తహసీల్దార్ నవీన్‌కుమార్, ప్యాక్స్ సీఈఓ తిరుపతిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.