Share News

మాదక ద్రవ్యాలతో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:24 AM

మాదకద్రవ్యాలకు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటుపడి విలువైన జీవితాలను నాశ నం చేసుకోవద్దని రామగుండం కమిషనరేట్‌ పరి ధిలోని నార్కోటిక్‌ బ్యూరో ఏసీపీ ఉపేందర్‌ అన్నారు.

మాదక ద్రవ్యాలతో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు

సుల్తానాబాద్‌, అక్టోబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాలకు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటుపడి విలువైన జీవితాలను నాశ నం చేసుకోవద్దని రామగుండం కమిషనరేట్‌ పరి ధిలోని నార్కోటిక్‌ బ్యూరో ఏసీపీ ఉపేందర్‌ అన్నారు. సుల్తానాబాద్‌ పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన గంజాయి, మత్తు పదార్థాల ని యంత్రణ కార్యక్రమంలో హాజరైన విద్యార్థులు, యువతను ఉద్ధేశించి ఏసీపీ మాట్లాడారు. మ త్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాల వాడకం గురించి ఎవరికి తెలిసినా వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ 14446కు ఫోన్‌ చేసి తెలుపాలన్నా రు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపుతూ అను కున్న లక్ష్యాన్ని చేరుకోవాలని పలురుకి ఆదర్శం గా నిలువాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవాణి విద్యా సంస్థల డైరక్టర్‌ రేకులపల్లి సుష్మ, ఎస్‌ఐ శ్రావణ్‌ కుమార్‌,డాక్టర్‌ సింధూజ, బండారి కమ లాకర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:24 AM