ప్రణాళికాబద్ధంగా సుల్తానాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Nov 21 , 2024 | 12:21 AM
సుల్తానాబాద్ పట్టణ అభివృద్దికి, పట్టణ సుందరీకరణకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు.
సుల్తానాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ పట్టణ అభివృద్దికి, పట్టణ సుందరీకరణకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ లోని ఒకటవ, పదకొండవ వార్డులకు టీయూఎఫ్ఐడీసీ కింద మం జూరైన నిధులతో శాస్త్రినగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధ వారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం వివిధ శాఖల నుంచి నిధులు సమకూర్చుకోవడం జరుగుతుందన్నారు. పట్టణంలో రోడ్లు డ్రైనేజీలు, రక్షిత మంచినీటి సరఫరాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రజలకు మౌలిక సదుపాలయ కల్పనలో అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, వైస్‌చైర్‌పర్సన్ బిరుదు సమత క్రిష్ణ, సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సాయిరి మహేందర్, పద్మ, రాజయ్య, మార్కెట్ డైరక్టర్ ఎండీ అమీనొద్దిన్, రాజు, అబ్బయ్యగౌడ్, రవిందర్, మేరుగు వెంకటేశ్, గాజుల హరీష్, గాదాసు రవి, స్వామి, రమణ తదితరులు పాల్గొన్నారు.