Share News

గోదావరిఖని బస్టాండ్‌ అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:43 PM

గోదావరిఖని బస్టాండ్‌ను త్వరలో మోడల్‌ బస్టాండ్‌గా తీర్చిదిద్దుతానని రామగుండం ఎమ్మెల్యే మక్కా న్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు.

గోదావరిఖని బస్టాండ్‌ అభివృద్ధికి కృషి

కళ్యాణ్‌నగర్‌, జనవరి 12: గోదావరిఖని బస్టాండ్‌ను త్వరలో మోడల్‌ బస్టాండ్‌గా తీర్చిదిద్దుతానని రామగుండం ఎమ్మెల్యే మక్కా న్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. శుక్రవారం గోదావరిఖని బస్టాండ్‌ను పరిశీలించారు. అనంతరం ప్రయాణీకులతో మాట్లాడారు. బస్టాండ్‌ లో ప్రయాణికులకు అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్‌లో ప్రయాణీకులకు అసౌకర్యం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రయా ణికులు కూర్చునేందుకు మరిన్ని కుర్చీలు ఏర్పాటు చేయాలని ఆర్‌ టీసీ అధికారులకు సూచించారు. బస్టాండ్‌ అభివృద్ధిపై డీపీఆర్‌ను తయారుచేసి ఇవ్వాలని ఆర్‌టీసీ అధికారులను కోరారు. మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, కమిషనర్‌ నాగేశ్వర్‌, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బాల రాజ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:43 PM