Share News

సర్వేకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Nov 06 , 2024 | 12:57 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం నుంచి సర్వే ప్రారంభం కానుంది. జిల్లాలోని 15 మండలాలు, కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, జమ్మికుంట, హుజురాబాద్‌, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీలను 1,958 ఎలకో్ట్రల్‌ బ్లాక్‌లుగా విభజించారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు 1964 మంది ఎన్యూమరేటర్లను, 207 మంది సర్వేయర్లను నియమించారు.

సర్వేకు సర్వం సిద్ధం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం నుంచి సర్వే ప్రారంభం కానుంది. జిల్లాలోని 15 మండలాలు, కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, జమ్మికుంట, హుజురాబాద్‌, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీలను 1,958 ఎలకో్ట్రల్‌ బ్లాక్‌లుగా విభజించారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు 1964 మంది ఎన్యూమరేటర్లను, 207 మంది సర్వేయర్లను నియమించారు. ఈనెల 6 నుంచి 30వ తేదీ వరకు సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకాధికారులు సర్వేను నిరంతరం పర్యవేక్షిస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీ)లకు సర్వే బాధ్యతలను అప్పగించారు.

ఫ కంప్యూటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు సిద్ధం

బుధవారం నుంచి సర్వే పూర్తయ్యే వరకు సర్వే విధుల్లో పాల్గొంటున్నందున పాఠశాలలు ఉదయం ఒక పూట మాత్రమే నిర్వహిస్తారు. మధ్యాహ్నం నుంచి వారు సర్వే విధుల్లో పాల్గొంటారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల అంశాలతో చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ముందుగా ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి నెంబర్లను కేటాయించి స్టికర్లను అతికిస్తారు. ఇంటి నంబర్‌ లేకపోతే సర్వేచేసిన అనంతరం ఆన్‌లైన్‌లో పొందు పరచడం వీలు కాదు. సూపర్‌వైజర్లు వారికి కేటాయించి బ్లాకుల్లో క్షేత్రస్థాయికి వెళ్లి కనీసం 10శాతం ఇండ్లను సందర్శించాల్సి ఉంటుంది. సర్వే సమాచారాన్ని ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో నిక్షిప్తం చేసే విధంగా కంప్యూటర్లను, డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఎంపీడీవోలు, ప్రత్యేకాధికారులు సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే సర్వేకు సంబంధించిన స్టేషనరీ, ప్రశ్నావళి పత్రాలను, స్టిక్కర్లను బ్లాకులకు చేరవేశారు. సర్వే కోసం ఇంటికి ఎప్పుడు వస్తారనే విషయాన్ని సంబంధింత యజమానికి తెలిపి ప్రశ్నావళిలోని సమాచారాన్ని తెలుసుకుంటారు. 25 రోజులపాటు సాగే ఈ సర్వేలో విధులను కేటాయించిన ఎన్యూమరేటర్లు, సర్వేయర్లు, అధికారులు గైర్హాజరైతే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

ఫ సహకరించాలని కలెక్టర్‌ విజ్ఞప్తి

ఇప్పటికే సర్వేపై అవగాహనకల్పించిన జిల్లా యంత్రాంగం మంగళవారం టెలీ కాన్ఫరెన్సు నిర్వహించి అధికారులు, సిబ్బందిని బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి సర్వేలో పాలొ ్గనేలా అప్రమత్తం చేసింది. ఇంటి నంబర్ల కోసం కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఇం టి యజమానులు వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. దరఖాస్తులను మున్సిపల్‌ రెవెన్యూ సిబ్బంది వెరిఫికేషన్‌ చేసి వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తారు. ప్రశ్నావళిలో పేర్కొన్న అంశాలను క్షుణ్ణంగా చదివి తప్పుడు సమాచారమివ్వకుండా ఎన్యూమరేటర్లకు సహకరించి సర్వే విజయవంతం చేయాలని కలెక్టర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు సమాచారమిస్తే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు.

ఫ ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కరింగ్‌ చేయాలి

- అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌

సమగ్ర ఇంటింటి సర్వేకు సంబంధించి ఎనుమరేషన్‌ బ్లాక్‌లో ఇళ్ల జాబితాను పకడ్బందీగా తయారు చేయాలని, ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కరింగ్‌ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ప్రత్యేకాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో సర్వే ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా ఇళ్ల జాబితా సిద్ధం చేసి, ప్రతి ఇంటికి స్టిక్కరింగ్‌ చేయాలని సూచించారు. సూపర్‌వైజర్లు విధిగా 10 శాతం ఇళ్లను సందర్శించాలని, ప్రత్యేకాధికారులు సర్వే తీరును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సేకరించిన సర్వే సమాచారాన్ని వెంటవెంటనే కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయాలని, ఇందుకోసం ఎంపీడీవోలు, అధికారులు కంప్యూటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను సమకూర్చుకోవాలని సూచించారు. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు గైర్హాజరైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వేకు కావలసిన స్టేషనరీ ఇప్పటికే ఆయా కేంద్రాలకు పంపించామని తెలిపారు. అధికారులు సంబంధిత ఇళ్ల్ల వివరాలను ప్రజలందరికి ముందుగా తెలియజేయాలని సూచించారు. సర్వేకు ప్రజలు సహకరించాలని అదనపు కలెక్టర్‌ కోరారు.

Updated Date - Nov 06 , 2024 | 12:57 AM