మాజీ సర్పంచుల కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:59 AM
గ్రామాల్లో చేపట్టి న అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ సర్పంచుల ఫోరం జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రికత్తకు దారి తీసింది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని శాంతియుతంగా నెలరోజులు రిలే దీక్షలు, ఆందోళనలు చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో మాజీ సర్పంచులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు.
సిరిసిల్ల కలెక్టరేట్, నవంబరు 11 (అంధ్రజ్యోతి) : గ్రామాల్లో చేపట్టి న అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ సర్పంచుల ఫోరం జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రికత్తకు దారి తీసింది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని శాంతియుతంగా నెలరోజులు రిలే దీక్షలు, ఆందోళనలు చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో మాజీ సర్పంచులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. 2019 నుంచి 2024 వరకు ఉన్న పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. రగుడు జంక్షన్ నుంచి ర్యాలీగా తరలిరావడంతో కలెక్టరేట్ ఎదుట పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్‌ను కలుస్తామంటూ దూసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వినిపించుకోకుండా కలెక్టరేట్‌లోకి పరుగు తీయడంతో పోలీసులు గేట్లను మూసివేశారు. ఆగ్రహించిన మాజీ సర్పంచ్‌లు అక్కడే బైఠాయించారు. డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, టౌన్ సీఐ కృష్ణ ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడుతుండగానే కొందరు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకొని మాజీ సర్పంచ్‌లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాజీ సర్పంచ్‌లను పోలీసు వాహనాలల్లో కలెక్టరేట్‌లోకి తీసుకురాగా వారు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు వినతి పత్రాన్ని అంజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లో రైతు వేదికలు, శశ్మాన వాటికలు, డంపింగ్ యార్డులు, క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, మిషన్‌భగరీథ పనులు, సీసీ రోడ్లు, మురికికాలువలతోపాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టినా బిల్లులు రాలేదని, వాటికోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జేఏసీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపెల్లి కరుణాకర్, ప్రధాన కార్యదర్శి దుమ్మ అంజయ్య, ఉపాఽధ్యక్షులు గణుప శివజ్యోతి, చాకలి రమేష్, బోజ్జం మల్లేశం, కోల నర్సయ్య, వంశీకృష్ణరావు, గున్నాల లక్ష్మణ్, చల్లనారాయణ, బూర్గుల నందయ్య, పోన్నాల మల్లారెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం ఆందోళనలు చేస్తుండడంతో పోలీసులు గేట్లను మూసివేశారు. కలెక్టరేట్‌లో ప్రజావాణిలో పాల్గొనేందుకు వచ్చిన జిల్లా అఽధికారులతో పాటు ప్రజలను అనుమతించకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. మాజీ సర్పంచ్‌లను అరెస్ట్ చేసిన అనంతరం జిల్లా అధికారుల ఐడీ కార్డులను చూసి పంపించారు. దీంతో అధికారులతోపాటు ప్రజలు గంటల తరబడి నిరీక్షించారు.