కరీంనగర్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు
ABN , Publish Date - Apr 26 , 2024 | 11:56 PM
కరీంనగర్ బస్‌స్టాండ్, రైల్వేస్టేషన్లలో వాహన తనిఖీలు ఇతర రద్దీ ప్రదేశాల్లో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 26: కరీంనగర్ బస్‌స్టాండ్, రైల్వేస్టేషన్లలో వాహన తనిఖీలు ఇతర రద్దీ ప్రదేశాల్లో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎన్నికలు ముగిసే వరకు ఈ ఆకస్మిక తనీఖీలు నిర్వహిస్తామని సీపీ అభిషేక్ మొహంతి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నియమావళీకి అనుగుణంగా నడుచుకోవాలని కోరారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు చేపడతామన్నారు.