వసతులు కరువు...చదువులు బరువు
ABN , Publish Date - Dec 22 , 2024 | 02:39 AM
అవి సంక్షేమ హాస్టళ్లు.. కానీ విద్యార్థులు మాత్రం అ నేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యార్థులకు సరిపడా సౌకర్యాలు అధికారులు కల్పించకపోవడంతో అలానే చదువులను నెట్టుకొస్తున్నారు. భోజనంలో మె నూ పాటించరు, నీళ్ల పప్పు, పురుగుల అన్నం, కంపుకొడుతున్న మరుగుదొడ్లు, చన్నీటి స్నానాలు, తలుపులు లేని కిటికీలు, నేలపైనే నిద్ర, సరిపడా లేని దుప్పట్లు.. అందుబాటులో ఉండని వార్డెన్లు..ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
నరకప్రాయంగా గురుకులాలు, వసతి గృహాలు
అద్దె భవనాలతో అవస్థలు
పారిశుధ్యం నిర్వహణ సరిగా లేక దుర్గంధం
అధ్వానంగా మరుగుదొడ్లు, బాత్ రూంలు...వంట గదులదీ అదే పరిస్థితి
మెనూకు మంగళం..అరటిపండ్లు, గుడ్లకు కోత
నాణ్యత తగ్గిన భోజనంతోనే సరి
‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌లో పలు విషయాలు వెలుగులోకి...
అవి సంక్షేమ హాస్టళ్లు.. కానీ విద్యార్థులు మాత్రం అ నేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యార్థులకు సరిపడా సౌకర్యాలు అధికారులు కల్పించకపోవడంతో అలానే చదువులను నెట్టుకొస్తున్నారు. భోజనంలో మె నూ పాటించరు, నీళ్ల పప్పు, పురుగుల అన్నం, కంపుకొడుతున్న మరుగుదొడ్లు, చన్నీటి స్నానాలు, తలుపులు లేని కిటికీలు, నేలపైనే నిద్ర, సరిపడా లేని దుప్పట్లు.. అందుబాటులో ఉండని వార్డెన్లు..ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అనేక సమస్యలు వెంటాడుతుండడంతో విద్యార్థులు చదువుపై ధ్యాస పెట్టలేకపోతున్నారనేది తల్లిదండ్రుల అభిప్రాయం.
జగిత్యాల, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ హాస్టళ్లు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా యి. మరుగుదొడ్లు, స్నానాల గదులతో పాటు వంట శా లల్లోనూ అపరిశుభ్ర వాతావరణం. కొన్ని చోట్ల విద్యార్థు లతోనే గదులు, ఆవరణలు శుభ్రం చేయిస్తున్నారు. వి ద్యార్థులకు ఇవ్వాల్సిన అరటి పండ్లు, గుడ్లు ఎక్క డా కనిపించవు. విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా, మోడల్ స్కూల్స్‌లలో పసతులు కరువయ్యాయి. మొత్తం విద్యా ర్థుల సంఖ్యకు, హాజరు పట్టికలో నమో దు చేసిన సం ఖ్యకు, వాస్తవంగా తరగతి గదిలో ఉన్న వారి సంఖ్యకు మద్య వ్యత్యాసం ఉంటోంది. జిల్లా వ్యాప్తంగా నిర్వహిం చిన ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి...
కరువైన రక్షణ..
పలు గురుకులాలు, మోడల్ స్కూల్స్, సంక్షేమ పాఠ శాలలు, కస్తూర్భాలో విద్యార్థులకు రక్షణ కరువవుతోం ది. మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరం సుమారు ఎని మిది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం, ఇందులో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం గురుకులాల్లో వి ద్యార్థులకు కరువైన రక్షణకు అద్దం పడుతున్నాయి.
చిల్లులు పడిన రేకులు..
పలు ప్రాంతాల్లో రేకుల షెడ్లలో హాస్టళ్లను కొనసా గిస్తున్నారు. మరికొన్ని హాస్టళ్లలో చిల్లులు పడిన పైక ప్పు రేకుల కారణంగా వర్షాకాలం నీరు రావడం, చలి కాలంలో విద్యార్థులు తీవ్ర చలితో ఇబ్బందులు పడుతున్నారు.
అద్దె భవనాలతో అవస్థలు..
జిల్లాలోని చాలా హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు అ ద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అద్దె భవనాల్లో సరైన వసతి లేకపోవడం వల్ల విద్యార్థులు ప్రతి నిత్యం నర కం అనుభవిస్తున్నారు.
కిటికీలు..తలుపులు సరిగా లేక..
జిల్లాలోని పలు హాస్టళ్లలో కిటికీలు, తలుపులు సరి గా లేకపోవడం వల్ల విద్యార్థులు అవస్థల పాలవుతు న్నారు. కిటికీలున్నప్పటికీ వాటికి సరైన డోర్లు లేకపో వడం వంటి సమస్యలున్నాయి. దీంతో గదుల్లోకి విషపు కీటకాలు, పాములు, ఎలుకలు చొచ్చుకొచ్చే ప్రమాదాలు న్నాయి. దోమ తెరల నిర్వహణ సరిగా ఉండడం లేదు. చలికాలం కిటికీలు, తలుపులు సరిగా లేకపోవడంతో తీవ్రమైన చలితో విద్యార్థులు అవస్థల పాలవుతున్నారు.
చలికాలంలో చన్నీటి స్నానాలు..
వసతి గృహ విద్యార్థులు అనేక చోట్ల చన్నీటి స్నానా లు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో హీటర్లు లేకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో హీటర్లున్నప్పటికీ విద్యుత్ కనెక్షన్ లేకపోవడం వంటి పరిస్థితులున్నాయి. ప్రత్యామ్నా యంగా పలు హాస్టళ్లలో కట్టెల పొయ్యిపై నీరు వేడి చేసి అందిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అను గుణం గా సరియైున సమయంలో వేడి నీరు అందకపోవడంతో చన్నీటి స్నానాలు చేస్తూ గజగజ వణుకుతున్నారు.