Share News

చిరువ్యాపారులకు న్యాయం జరిగే వరకూ పోరాటం

ABN , Publish Date - Nov 12 , 2024 | 12:24 AM

అభివృద్ధి పేరిట పాలకులు చిరు వ్యాపారుల పొట్ట కోడుతున్నార ని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు.

చిరువ్యాపారులకు న్యాయం జరిగే వరకూ పోరాటం
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

గోదావరిఖని, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పేరిట పాలకులు చిరు వ్యాపారుల పొట్ట కోడుతున్నార ని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. సోమవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తలో చిరు వ్యాపారులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్‌ పరిధిలో అభివృద్ధి పేరిట ఇటీవల అధికారులు ఇష్టానుసారంగా కూల్చివేతలు చేపట్టారన్నారు. దీంతో వ్యాపారస్తులు రోడ్డున పడ్డారన్నా రు. వ్యాపా రస్తులకు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుం డా కూల్చి వేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. వెంటనే చిరు వ్యాపారులకు ప్రత్యామ్నా య మార్గాలు చూపించాలని డిమాండ్‌ చేశారు. ఎన్టీపీసీ, మేడిపల్లి సెంటర్‌లో చిరువ్యాపారులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా వారి దుకణాలు కుల్చి వారి జీవితాలను రోడ్డు మీదపడేశారన్నారు.

గోదావరిఖని పట్టణంలో ఓల్డ్‌ అశోక్‌ టాకీస్‌, గాంధీ నగర్‌, హనుమాన్‌నగర్‌లలో చిరువ్యాపారుల దుకణాల ను కుల్చారన్నారు. గోదావరిఖనిలో చిరువ్యాపారులకు ఎలాంటి ప్రత్యామ్నాయ చూపకుండా దుకా ణాలను కుల్చడం దారుణమన్నారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉరుకో బోమన్నారు. అధికార పక్షం ప్రతిపక్షాలపై కేసులు పెడుతూ నోరునోక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. అహంకారపు పాలనను సాగిస్తున్న అధికార పార్టీని ప్రజలు బొంద పెట్టేందుకు సిద్ధం కావాలన్నారు. నిరసన దీక్షకు న్యూ ఇండియా పార్టీ నాయకులు జేవీ రాజు, వేముల అశోక్‌ సంఘీబావం తెలిపారు.

ఈ నిరసన దీక్షలో రామగుండం నగర డిప్యూటీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌రావు, మాజీ జెడ్‌పీటీసీ ఆముల నారాయణ, కార్పొరేటర్లు పెంట రాజేష్‌, పాముకుంట్ల భాస్కర్‌, బాదే అంజలి, కల్వచర్ల కృష్ణవేణి, కుమ్మరి శ్రీనివాస్‌, గాదం విజయ, ఐత శివ కుమార్‌, జనగామ కవిత సరోజిని, మజీ వైస్‌ ఎంపీపీ మట్ట లక్ష్మి, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 12:25 AM