Share News

కల్చరల్‌ మీట్‌తో విద్యార్థుల్లో స్నేహభావం

ABN , Publish Date - Nov 15 , 2024 | 12:38 AM

కల్చరల్‌ మీట్‌తో విద్యార్థుల్లో స్నేహభావం పెంపొందుతుందని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్‌ జల్ల సత్యనారాయణ అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలోని జగ్జీవన్‌రామ్‌ వ్యవసాయ కళాశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కల్చరల్‌ మీట్‌ ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది.

కల్చరల్‌ మీట్‌తో విద్యార్థుల్లో స్నేహభావం
విజేతలకు మెమోంటో, ప్రశంసాపత్రాలను ప్రధానం చేస్తున్న డీన్‌ సత్యనారాయణ

- జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్‌ సత్యనారాయణ

తంగళ్లపల్లి, నవంబర్‌ 14 (ఆంఽధ్రజ్యోతి): కల్చరల్‌ మీట్‌తో విద్యార్థుల్లో స్నేహభావం పెంపొందుతుందని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్‌ జల్ల సత్యనారాయణ అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలోని జగ్జీవన్‌రామ్‌ వ్యవసాయ కళాశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కల్చరల్‌ మీట్‌ ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా 26 అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మెమోంటోలను డీన్‌ సత్యనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా డీన్‌ సత్యనారాయణ మాట్లాడుతూ మూడు రోజులుగా నిర్వహించిన కల్చరల్‌ మీట్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల నుంచి కల్చరల్‌ మీట్‌కు వచ్చిన విద్యార్థులు తమ ప్రతిభను కళ్లకు కట్టారని కొనియాడారు. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు హైదరబాద్‌లోని రాజేంద్రనగర్‌ వ్యవసాయ కళాశాలలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల విద్యార్థులకు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ శ్రీదేవి, యూనివర్సిటీ అబ్జార్వర్‌ డాక్టర్‌ త్రివేణి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రమేశ్‌, రాష్ట్రంలోని 11 కళాశాలలకు చెందిన 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

విజేతలు నిలిచిన విద్యార్థులు..

మూడు రోజుల పాటు 26 అంశాలలో విధ్యార్ధులు ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలిచారు. రంగోలిలో జగిత్యాలకు చెందిన ఎ కావ్య, పెయింటింగ్‌లో ఆశ్వరావుపేట వ్యవసాయ కళశాలకు చెందిన జి రిశిత, పోస్టర్‌ మేకింగ్‌లో సైఫాబాద్‌ కళాశాల విద్యార్థి ఖుషీ, జగిత్యాల వ్యవసాయ కళాశాల ముగ్గురు విద్యార్థులు, కార్టునింగ్‌లో జె. పర్ణషా, ఎస్‌ఏ రైటింగ్‌ ఇంగ్లీష్‌లో పి. రిషిత, ఎస్‌ఏ రైటింగ్‌ తెలుగులో తోర్ణల కళాశాల విద్యార్థి ఎన్‌ సంతోష్‌ ప్రథమ స్థానంలో నిలిచారు. ఇంగ్లీషు డిబెట్‌లో సిరిసిల్ల కళాశాలకు చెందిన ఉమ నజం, ఆర్‌ నవ్య, తెలుగు డిబెట్‌లో హైదరబాద్‌ కళాశాలకు చెందిన బి సాయిధీక్షిత, పి జయంతి, క్విజ్‌పోటీలో సిరిసిల్ల కళాశాలకు చెందిన సి సాయివెంకట్‌శివ, కె భార్గవరెడ్డి ప్రథమ స్థానాల్లో నిలిచారు. అలాగే గ్రూప్‌ సాంగ్‌లో ఆశ్వరావుపేట కళాశాల విద్యార్థి ఆర్‌ సాలోని, గ్రూప్‌, సోలో ఇన్సూ్ట్రమెంటల్‌లో రాజేంద్రనగర్‌ కళాశాల విద్యార్థి టి వసంత్‌, క్లాసికల్‌ డ్యాన్స్‌లో ఆశ్వరావుపేట కళాశాల విద్యార్థి ఏ సాధిత్య, స్కిట్‌లో హైదరాబాద్‌ కళాశాల విద్యార్థి ఏ జీవన, గ్రూప్‌, సోలో ఫోక్‌ సాంగ్‌లో వరంగల్‌ కళాశాల విద్యార్థి సి రైమా, గ్రూప్‌ డ్యాన్స్‌, ఫోక్‌ సాంగ్‌లో ఆశ్వరావుపేట కళాశాల విద్యార్థి ఆదిత్య, గ్రూప్‌, మొనో యాక్టింగ్‌లో వరంగల్‌ కళాశాల విద్యార్థి ఎం భార్గవి, సోలో ఫోక్‌ డ్యాన్స్‌ ఆశ్వరావుపేట కళాశాల విద్యార్థి ఎం ఆఖిల మొదటి స్థానంలో నిలిచారు. అలాగే ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు మెమోంటోలతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు.

Updated Date - Nov 15 , 2024 | 12:38 AM