లోక కల్యాణార్థం గణపతి హోమం
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:21 AM
లోక కల్యాణార్థం గణపతి హోమం నిర్వహించినట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తెలిపారు.
మంథని, సెప్టెంబరు 15: లోక కల్యాణార్థం గణపతి హోమం నిర్వహించినట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తెలిపారు. నియోజకవర్గ, రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా, సుఖశాంతులతో ఉండలాన కోరుకున్నట్లు తెలిపారు. మంథనిలోని రావుల చెరువుక ట్టలో గణపతి శత వసంతోత్సవాల సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆయ న సతీమణి, రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ దంప తులు ఆదివారం గణపతి హోమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌషిక్‌రెడ్డిల వివాదం ఆ పార్టీ అంత ర్గత అంశమని, దాన్ని వాళ్ళే పరిష్కరించుకోకుండా కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం సరికాదన్నారు. ఎవరు ఎంత తెలివైన వారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతిసే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలం గాణ రాష్ట్ర ఏర్పడ్డాక ఇక్కడ ఉన్న ప్రజలంతా తెలంగాణ ప్రజలేనన్నారు. హైదరా బాద్ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామ న్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.