Share News

నిత్యావసరాల ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:55 PM

నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బి ప్రసాద్‌ విమర్శించారు. మంగళవారం శంకరపట్నం మండలంలోని కొత్తగట్టులో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలో జాప్యం చేస్తోందన్నారు.

నిత్యావసరాల ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం
విలేకరులతో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రసాద్‌

శంకరపట్నం, అక్టోబరు 1: నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బి ప్రసాద్‌ విమర్శించారు. మంగళవారం శంకరపట్నం మండలంలోని కొత్తగట్టులో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలో జాప్యం చేస్తోందన్నారు. నిత్యవసర వస్తువులపై పన్నులు పెంచడంతో పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతోందన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఆర్భాటంగా ప్రకటించిన రైతు భరోసా అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచినా ఇవ్వలేదని విమర్శించారు. రైతుల రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేయలేదన్నారు. అక్టోబరు నెలలో రేషన్‌కార్డులు ఇస్తామని చెప్పారని, ఇంత వరకు విధివిధానాలు ప్రకటించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే లేని ప్రజల తరుపున సీపీఎం సమరశీల పోరాటాలు ప్రారంభిస్తుందని హెచ్చరించారు.

Updated Date - Oct 01 , 2024 | 11:55 PM