Share News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Nov 08 , 2024 | 12:15 AM

ప్రభుత్వం గ్రామా ల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొను గోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

పెద్దపల్లి రూరల్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం గ్రామా ల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొను గోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గురువారం పెద్దపల్లి మం డలం పెద్దకల్వల, పెద్దబొంకూర్‌, కొత్తపల్లి, మూలసాల, బొజన్నపేట, హనుమంతునిపేట, మారేడుగొండ, గుర్రాంపల్లి, ముత్తారం గ్రామాల్లో సింగిల్‌విండో, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయరమణరావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడు తూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుని మద్దతు ధర పొందాలని తెలిపారు. సన్నవడ్లకు క్వింటా లుకు రూ.500 బోనస్‌ చెల్లిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. ధాన్యంలో తరుగు పేరుతో కోతలు లేకుండా చివరి గింజవరకు ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో రైతులకు డబ్బులు చెల్లించేలా చర్యలు చేప ట్టినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ అసత్య ప్రచారాలు నమ్మవద్దని రైతులను కోరారు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు ధాన్యంలో తేమ శాతం ఉండేలా రైతులు చూసు కోవాలని తెలిపారు. రైతుకు అండగా ఉంటానని, ఏ చిన్న సమస్య తలెత్తినా ఫోన్‌ చేస్తే స్పందిస్తానని హామీ ఇచ్చా రు. ఈ కార్యక్రమాల్లో పెద్దపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఈర్ల స్వరూప, సింగిల్‌విండో చైర్మన్‌ మాదిరెడ్డి నర్సింహా రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సత్యం, సంతోష్‌, రమేష్‌, మల్లేష్‌, కుమార్‌, తిరుపతిరావు, సుధాకర్‌ రెడ్డి, మోహన్‌, సతీష్‌, సుకూర్‌, శ్రీకాంత్‌, రమేష్‌, సింగిల్‌విండో సీఈవోలు మద న్‌మోహన్‌, సురేష్‌తో పాటు డైరెక్టర్లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2024 | 12:15 AM