Share News

అందుబాటులో హోంగార్డుల సేవలు

ABN , Publish Date - Dec 06 , 2024 | 11:55 PM

క్షేత్రస్థాయిలో హోంగార్డులు ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉంటారని, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీస్‌ శాఖకు మంచి పేరు తీసుకురావాలని పోలీస్‌కమిషనర్‌ అభిషేక్‌ మొహంతి అన్నారు. 78వ హోంగార్డ్స్‌ రైసింగ్‌ డే సందర్భంగా పోలీస్‌ కమిషనరేట్‌ కేంద్రంలో శుక్రవారం కార్యక్రమాన్ని నిర్వహించారు.

అందుబాటులో హోంగార్డుల సేవలు
హోంగార్డులకు ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలు అందజేస్తున్న సీపీ అభిషేక్‌ మొహంతి

కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో హోంగార్డులు ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉంటారని, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీస్‌ శాఖకు మంచి పేరు తీసుకురావాలని పోలీస్‌కమిషనర్‌ అభిషేక్‌ మొహంతి అన్నారు. 78వ హోంగార్డ్స్‌ రైసింగ్‌ డే సందర్భంగా పోలీస్‌ కమిషనరేట్‌ కేంద్రంలో శుక్రవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ హోంగార్డ్‌ల సేవలను గుర్తు చేసుకునేందుకు ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా డిసెంబర్‌ 6వ తేదీన హోంగార్డ్స్‌ రైసింగ్‌ డే జరుపుకుంటామని తెలిపారు. పోలీస్‌ శాఖలోని అన్ని విభాగాల్లో హోంగార్డులు సేవలు అందిస్తునారన్నారు. కరీంనగర్‌ కమిషనరేట్‌లో ముఖ్యంగా బ్లూకోల్ట్స్‌, ట్రాఫిక్‌, శాంతిభద్రతల విధులు, నైట్‌ పెట్రోలింగ్‌లతో పాటు కమిషనరేట్‌లో దాదాపు హోంగార్డులు పనిచేయని విభాగం లేదన్నారు. గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలలో కూడా వారికి కేటాయించిన విధులు చాలా అద్బుతంగా నిర్వహించారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. యూనిఫామ్‌ ధరిం చాక అందరం సమానమమేనని అన్నారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా హోంగార్డులకు కేటాయించిన విధుల్లో ప్రతిభ కనబరిచిన 15మంది హోంగార్డులను గుర్తించి వారికి సీపీ ప్రశంసాపత్రాలతో పాటు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్‌ యాదవ్‌ వసుంధర ఫౌరేబి, అడిషనల్‌ డీసీపీ ఏ లక్ష్మీనారాయణ, ఆర్‌ఐలు మోడెం సురేష్‌, శ్రీధర్‌రెడ్డి అధికారులు, హోంగార్డులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 11:55 PM