ఆశాజనకంగా అభివృద్ధి
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:13 AM
జగిత్యాల జిల్లాకు ఈ సంవత్సరం పలు జ్ఞాపకాలను అందించింది. రాజకీయాలు గరం గరంగా మారా యి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ జగి త్యాల జిల్లాలో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో గతం కన్నా ప్రస్తుత యేడాది రూ. కోట్లలో నిధులు మంజూరయ్యాయి. అభివృద్ధి, సంక్షే మంపై ఆశలు చిగురింపజేశాయి.
జగిత్యాల స్మార్ట్ సిటీ వైపు అడుగులు
- ప్రత్యేక పాలనలో స్థానిక సంస్థలు
- విద్యా, వైద్య రంగంలో మెరుగైన ఫలితాలు
- జిల్లాకు నవోదయ విద్యాలయం..రెండు ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్
- కలవరం రేపిన పెద్దాపూర్ గురుకులం మరణాలు, అస్వస్థతలు
=====================
మరో యేడాది గడిచిపోతోంది. మూడు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అ డుగుపెట్టబోతున్నాం. ఈ యేడాదిలో జిల్లాలో అభివృద్ధి ఆశాజనకంగానే ఉంది. గతం కన్నా ప్రస్థుత సంవత్సరం ప్రాజెక్టుల అభివృద్ధితో పాటు, ఆ లయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కో ట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. అంతేకాకుండా జిల్లాలో ఉన్న ఏకైన చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టింది.
=================================
జగిత్యాల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాకు ఈ సంవత్సరం పలు జ్ఞాపకాలను అందించింది. రాజకీయాలు గరం గరంగా మారా యి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ జగి త్యాల జిల్లాలో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో గతం కన్నా ప్రస్తుత యేడాది రూ. కోట్లలో నిధులు మంజూరయ్యాయి. అభివృద్ధి, సంక్షే మంపై ఆశలు చిగురింపజేశాయి. జగిత్యాల, కోరుట్లలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ మంజూరు కాగా ఒక్కో చోట రూ. 100 కోట్లతో భవన నిర్మాణాలు చేపట్టడం పై దృష్టి సారించారు. అదేవిధంగా జగిత్యాల జిల్లాకు కేంద్రం నవోదయ వి ద్యాలయాన్ని మంజూరు చేసింది. స్థల సేకరణ పనులు జరుగుతున్నాయి. జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు అటానమస్ గుర్తింపు లభించ గా, రూ. 3 కోట్లతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరోవైపు సు ధీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రాళ్లవాగు ప్రాజెక్టు, రోళ్ల వాగు ప్రాజెక్టు, గం గనాల ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యాయి. జిల్లాలో ఆధ్యా త్మిక క్షేత్రాలయిన ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థాం, కొండగట్టు ఆం జనేయ స్వామి దేవస్థానాల అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారు దృష్టి సారిం చింది. జిల్లాలో ఏకైకా వ్యవసాయాదారిత పరిశ్రమైన ముత్యంపేట చక్క ర కర్మాగారాన్ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తుండడంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జగిత్యాల పట్టణాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించడానికి తోడు మున్సిపాలిటీలుగా ఉన్న జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, రాయికల్‌లలో మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రణా ళిక రూపొందించింది. 2024 జగిత్యాల జిల్లాలో ప్రత్యేక చోటును దక్కించు కుంది. ఇవన్నీ సాకారమైతే జిల్లా స్వరూపమే మారుతుందన్న అభిప్రాయా లు వ్యక్తం అవుతున్నాయి. కొత్త యేడాదిలో ఇదే ఒరవడి కొనసాగి జిల్లా అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు పెట్టాలన్న ఆకాంక్ష ప్రజల్లో కనిపిస్తోంది.
అభివృద్ధి వైపు అడుగులు...
జిల్లా అధికార యంత్రాంగం ఈ యేడాది తొలినాళ్లలో లోకసభ ఎన్నిక లను ఎలాంటి అవాంచనీయ సంఘటనలు లేకుండా సమర్థవంతంగా నిర్వ హించింది. గడిచిన యేడాది కాలంగా ఆధ్యాంతం అభివృద్ధి, సంక్షేమం స మానంగా అమలు చేశారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద సుమారు లక్ష కుటుంబాలకు పనికల్పించారు. హరితహారం కార్యక్రమం కింద సుమా రు అర కోటి మొక్కలు నాటి రక్షిస్తున్నారు. 2.50 లక్షల మందికి వివిధ ర కాల ఫించన్లను అందిస్తున్నారు. జిల్లాలో 12,785 స్వయం సహాయక సం ఘాలకు రూ. 600 కోట్ల రుణాలను అందించారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా వివిధ రకాల పనులను రూ. 250 కోట్లతో చేపట్టారు. ఇందులో పలు పనులు పూర్తి కాగా, మరికొన్ని పనులు ప్రగతిలో ఉన్నాయి. జిల్లాలోని కొం డగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం, ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దే వస్థానం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. హాస్టల్ విద్యార్థులకు డై ట్, కాస్మెటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. దీంతో జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, వేములవాడ, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాల పరి ధిలో ప్రస్తుతం 56కి పైగా రెసిడెన్షియల్ స్కూల్స్‌లలో పెంచిన డైట్, కాస్మె టిక్ చార్జీలను అమలు చేయనున్నారు.
మారిన జిల్లా ఉన్నతాధికారులు..
జిల్లాలో ప్రస్తుత యేడాదిలో జిల్లా ఉన్నతాధికారులల్లో మార్పు చోటుచే సుకుంది. దాదాపుగా రెండున్నరేళ్లుగా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన యాస్మిన్ భాషా బదిలీ కాగా ఆమె స్థానంలో సత్య ప్రసాద్ ఇక్కడకు బది లీపై వచ్చారు. జిల్లా ఎస్పీగా వ్యవహరించిన భాస్కర్ బదిలీ కాగా ఆయన స్థానంలో సన్‌ప్రీత్ సింగ్ జగిత్యాల ఎస్పీగా దాదాపు ఆరు మాసాలు విధు లు నిర్వర్తించారు. అనంతరం జరిగిన బదిలీల్లో సన్ ప్రీత్ సింగ్ స్థానంలో ఈ యేడాది జూన్ 18వ తేదీన నూతన ఎస్పీగా అశోక్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అదనపు కలెక్టర్‌గా వ్యవహరించిన రాంబాబు బదిలీ కాగా ఆయన స్థానంలో గతంలో జిల్లాలో విధులు నిర్వహించి బీఎస్ లత బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ఉన్న దివాకర్ బదిలీ కాగా ఆయన స్థానంలో ఇన్‌చార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా గౌతమ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. పలు ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, ఆర్‌డీవోలు సైతం బదిలీ కాగా సంబంధిత స్థానాల్లో కొత్త అధికారులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలోని పలు స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక పాలన కొనసా గుతోంది. జిల్లాలోని 18 మండల పరిషత్‌ల పాలకవ ర్గాలు, జిల్లా పరిషత్ పాలక వర్గాల పదవీ కాలం ప్రస్తుత యేడాదిలో ముగిసింది. దీంతో ప్రత్యేకాధి కా రులు జిల్లా పరిషత్, మండల పరిషత్ లలో బాధ్యత లు నిర్వహిస్తు న్నారు. దీనికి తోడు పంచాయతీల్లో సైతం ప్రత్యేకాధికా రులు విధులు నిర్వర్తిస్తున్నారు.
24 గంటల్లో.. 25 ప్రసవాలు..
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుత యేడాది అక్టోబర్‌లో గంటలోపు ఓ ప్రసవం చొప్పున ఇరవై నాలుగు గంటల్లో ఇరవై అయిదు ప్రసవాలు నిర్వహిం చి జగిత్యాల వైద్యులు రికార్డు కైవసం చేసుకున్నారు. ఇద్దరు గైనకాలజిస్టులు, ఇద్దరు అనెస్థీషియా వైద్యులతో పాటు సుమారు పది మంది వైద్య సిబ్బంది రికార్డు స్థాయిలో ప్రసవాలు జరిపారు. ఈ ప్రసవాల్లో 13 ప్రస వాలు సాధారణం కాగా, మిగితా 12 ప్రసవాలకు శస్త్ర చికిత్స జరిపారు. వీరిలో 11 మంది మగ పిల్లలు, 14 మంది ఆడ పిల్లలు జన్మించారు.
పెద్దాపూర్ గురుకులాన్ని సందర్శించిన
ఉప ముఖ్యమంత్రి...
జిల్లాలోని మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటు కలకలం రేపింది. ప్రస్తుత యేడాది ఎనిమిది మంది విద్యార్థులు పా ము కాటుకు గురైనట్లు అనుమానాలుండగా, అందులో ఇద్దరు మృతి చెం దారు. మూడున్నర నెలలు క్రితం వారం వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు పాముకాటుతో మృతి చెందగా మరో ఆరుగురు అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుత యేడాది జూ లై 27వ తేదీన పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 8వ తర గతి విద్యార్థి రాజారం గణాదిత్య (13) పాముకా టుకు గురై మరణించాడు. అదేరోజు మరో ఇద్దరు వి ద్యార్థులు ఆడెపు గణేష్ (13), రాపర్తి హర్షవర్ధన్ (14) లు సైతం అస్వస్థతకు గురై కోలుకున్నారు. ఆగస్టు మొ దటి వారంలో పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థి ఎడమల అనిరుధ్‌రెడ్డి (12), హేమంత్, మోక్షిత్ అనే విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. ఆసుపత్రి లో చికిత్స పొందుతూ అనిరుధ్‌రెడ్డి మరణించాడు. హే మంత్, మోక్షిత్ కోలుకున్నారు. ఆగస్టు 14వ తేదీన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాఠశాలను సందర్శిం చి సమీక్ష జరిపారు. అధికారులకు పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుత మాసంలో రెండు రోజుల వ్యవధిలో పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మెట్‌పల్లి పట్టణానికి చెందిన అఖిల్ (14) అస్వస్థత చెందగా, యశ్వంత్ (14) అస్వస్థతకు గురయ్యాడు.
పెరిగిన ఆధ్యాత్మికత...
జిల్లాలో ఆధ్యాత్మికత పెరిగింది. ఆలయాల్లో పూజలు, ఉత్సవాలు వైభవంగా జరిగాయి. కొండగట్టు, ధర్మపురిలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇబ్ర హీంపట్నం మండలం బండలింగాపూర్ శివారులో గల గండి హనుమాన్ దేవస్థానం, సారంగపూర్ మండలం పెంబెట్ల రాజేశ్వర స్వామి దేవస్థానం, కోరుట్ల సాయి బాబా ఆలయం, అష్టలక్ష్మీ ఆలయం, వెల్గటూరు మండ లం కోటిలింగాల తదితర దేవస్థానాల వద్ద ఆధ్యాత్మిక కార్యక్ర మాలతో శోభిల్లింది.
ఫప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు
అటానమస్...
జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు ప్రస్తు త యేడాదిలో యూ జీసీ స్వయం ప్రతిపత్తి హోదాను కల్పించింది. దీంతో మినీ విశ్వవిద్యాలయంగా రూపుది ద్దుకోనుంది. దీనికి తోడు పీఎం ఉషా పథకం ద్వారా క ళాశాల నూతన భవన నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రూ. 5 కోట్లు మంజూరు చేయడంతో పను లు జరుగుతున్నాయి.
ఫజిల్లాకు రెండు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్
మంజూరు..
సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఇండియా ఇంటిగ్రే టెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటులో భాగంగా జగిత్యాల జిల్లాకు రెండు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసింది. జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్నారు. చల్‌గల్ గ్రామంలో గల వాలంతరీ స్థలంలో భవన నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
ఫచక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అడుగులు..
మల్లాపూర్ మండలం ముత్యంపేట చక్కెర కర్మాగా రం పునర్ధుదరణకు కాంగ్రెస్ సర్కారు అడుగులు వేసిం ది. అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చేసిన ప్రకటన అటు రైతుల్లో, ఇటు ఉద్యో గుల్లో ఆశలు చిగురింపజేసింది. కమిటీ ఇచ్చిన ప్రతిపా దనలను ప్రభుత్వం నాలుగు నెలల క్రితం ఆమోదించిం ది. పలు కారణాల వల్ల లే ఆఫ్‌తో మూసివేసిన కర్మాగా రాలు బ్యాంకుల్లో అప్పుల్లో ఉండగా వీటికి సంబందించి, వన్‌టైం సెటిల్ మెంట్ కింద రూ. 190 కోట్లు ప్రభుత్వం చెల్లించింది.
ఫపర్యాటకంలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు..
జిల్లాలో యువ క్లబ్‌ల ఏర్పాటుతో పర్యాటక అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భా గంగా జిల్లా వ్యాప్తంగా గల పలు ఉన్నత పాఠశా లలు, కళాశాలల్లో విద్యార్థులతో యువ టూరిజం క్లబ్‌ను ము మ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వా లు ప్రతీయేటా ప్రపంచ పర్యాటక దినోత్సవం సంద ర్భంగా నిర్వహిస్తున్న పోటీల్లో ప్రస్తుత యేడాది అక్టో బర్‌లో జగిత్యాల జిల్లాకు రాష్ట్ర స్థాయిలో తృతీయ బ హుమతి దక్కింది. హైద్రాబాద్‌లో వరల్డ్ టూరిజం సెల బ్రేషన్లలో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా కలెక్టర్ సత్యప్రసాద్ బహుమతితో పాటు రూ. లక్ష నగదును అందుకున్నారు.