ప్రగతి ప్రణాళికల రూపకల్పనకే ఇంటింటి సర్వే
ABN , Publish Date - Nov 08 , 2024 | 12:12 AM
రాష్ట్రంలో ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ప్రగతి ప్రణాళికలు రూపకల్పన కోసం తమ ప్రజా ప్రభుత్వం ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
మంథని, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ప్రగతి ప్రణాళికలు రూపకల్పన కోసం తమ ప్రజా ప్రభుత్వం ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మంథని లో రూ.75 లక్షలతో నూతనంగా నిర్మించే కేడీసీసీ బ్యాంక్ భవన నిర్మాణానికి మం త్రి శ్రీధర్‌బాబు గురువారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ సర్వేపై కొంతమంది ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నార న్నారు. ఇంటింటి సర్వే ప్రజలకు ఎలాంటి అపోహలు వద్దన్నారు. ఈ సర్వేతో ప్రస్తు తం అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు, భవిష్యత్తులో అమలు చేసే పథకా లకు ఎటువంటి సంబంధం లేదన్నారు. సర్వేకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలన్నారు. హౌస్ లిస్టింగ్ పూర్తిచేసినా స్టిక్కర్ వేయని ఇండ్లను గుర్తించి వాటికి గల కారణాలను తెలుసుకొని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఇచ్చి న హామీలను నేరవేర్చుకుంటూ వస్తున్నామన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500లకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామన్నారు. రైతుల నాణ్యమైన ధ్యానాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసి 48 గంటల్లో డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుంటామన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ కోసం రూ.18వేల కోట్లు చెల్లిం చామన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే రైతుల సన్న వడ్లకు రూ. 5వందల బోనస్ ప్రకటించామన్నారు. గతంలో మాదిరిగా రైతుల వద్ద ఎలాంటి కోతలు ఉండవ న్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, సీఈ వో సత్యనారాయణరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ పెండ్రి రమ-సురేష్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, నేతలు శశిభూషణ్ కాచే, వొడ్నాల శ్రీనివాస్, ఐలి ప్రసాద్, రావికంటి సతీష్‌లు పాల్గొన్నారు.