డ్రోన్, సీసీ కెమెరాల నిఘాలో నిమజ్జనం
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:24 AM
డ్రోన్లు, సీసీ నిఘాలో గణపతి నిమజ్జ నం జరుగనున్నదని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పే ర్కొన్నారు.
కోల్‌సిటీ, సెప్టెంబరు 15: డ్రోన్లు, సీసీ నిఘాలో గణపతి నిమజ్జ నం జరుగనున్నదని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పే ర్కొన్నారు. పెద్దపల్లి జోన్ పరిధిలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరుగకుం డా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆదివారం గోదావరిఖని ప ట్టణంలో నిమజ్జనం జరిగే ప్రదేశాలు, శోభయాత్ర రూట్‌ను పెద్దప ల్లి డీసీపీ చేతన, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జన సమ యంలో పోలీసుల సూచనలకు అనుగుణంగా నిర్వాహకులు, ఉత్స వ కమిటీ సభ్యులు నడుచుకోవాలన్నారు. నిమజ్జన సందర్భంగా జిల్లాలోనివివిధ ప్రాంతాల్లో భారీ బందోబస్తు, పోలీస్ పికెట్లు ఏర్పా టు చేశామన్నారు. మొదటి సారిగా కమిషనరేట్‌పరిధిలో శోభా యాత్రపై డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తామన్నారు. ఉత్సవ కమి టీలు త్వరితగతిన పూజలు ముగించుకుని వెలుగుతు ఉండగానే విగ్రహాలను జాగ్రత్తగా నిమజ్జనం చేయాలన్నారు. నిమజ్జన ఊరే గింపు సమయంలో డీజేలు, బాణాసంచా కాల్చడం నిషేధమన్నారు. సీపీ ఎస్‌బీ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పె క్టర్ ఇంద్రసేనారెడ్డి, టుటౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌రావు ఉన్నారు.