పారిశుధ్య పనులను మెరుగుపర్చండి
ABN , Publish Date - Nov 17 , 2024 | 12:10 AM
రామగుండం కార్పొరేషన్ పారిశుధ్య నిర్వహణ మెరుగుపర్చాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సూచించారు.
కోల్‌సిటీ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : రామగుండం కార్పొరేషన్ పారిశుధ్య నిర్వహణ మెరుగుపర్చాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సూచించారు. శనివారం రూ.1.04కోట్లతో కొనుగోలు చేసిన పారిశుధ్య వాహనాలను కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేషన్‌లో పారిశుధ్య పనులను మెరుగుపర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసు కుంటోందన్నారు. రామగుండం నగరాన్ని సుందరంగా మార్చేందుకు అవసరమైన వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. గతంలో కార్పొరేషన్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, రామగుండం నగరానికి పూర్వవైభవం తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టామన్నారు. దీనికి ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలంటే పారిశుధ్య సిబ్బందితోపాటు మనవంతు పాత్ర ను పోషించాలని, ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో నగరాన్ని అలా ఉంచుకోవాలన్నారు. బయట చెత్త వేయకుండా ఇంటింటికి వచ్చే పారిశుధ్య కార్మికు లకు చెత్తను అందజేయాలని కోరారు. కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ కార్పొరేషన్‌లో పారిశుధ్య నిర్వహణ మెరుగపర్చేందుకు రూ.1.04కోట్లతో ఐదు ట్రాక్టర్లు, 8ఇతర భారీ వాహనాలు, 70ట్రిబుల్ లిట్టర్ బిన్స్, 100రెండు చక్రాల బారోలను తీసుకువ చ్చామని, చెత్త సేకరణ వాహనాలు, సామగ్రిని వినియోగిస్తే నగరం పరిశుభ్రంగా ఉంటుందని, దీనికి ప్రజలు సహకరించాలని, చెత్తరహిత రామగుండంగా తీర్చిదిద్ద డమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ బంగి అనీల్ కుమార్, కమిషనర్ అరుణశ్రీతో పాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు.