ఇదేనా ‘సంక్షేమం’
ABN , Publish Date - Dec 22 , 2024 | 02:41 AM
సంక్షేమ వసతిగృహాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. వసతుల లేమితో, అరకొర సౌకర్యాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పడుకునే మంచాలు లేక నేలపైనే నిద్రిస్తున్నారు.
- సంక్షేమ వసతి గృహాల్లో అడుగడుగునా సమస్యలు
- అధ్వాన స్థితిలో హాస్టల్స్ భవనాలు
- కిటికీలు సరిగా లేక విద్యార్థుల ఇబ్బందులు
- ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌లో వెల్లడైన నిజాలు..
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
సంక్షేమ వసతిగృహాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. వసతుల లేమితో, అరకొర సౌకర్యాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పడుకునే మంచాలు లేక నేలపైనే నిద్రిస్తున్నారు. బెడ్‌షీట్లు, బ్లాంకెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు చలికి వణుకుతున్నారు. అద్దె భవనాల్లో, కొత్తగా నిర్మించిన భవనాల్లో కొంత మేరకు పరిస్థితులు బాగున్నా చాలా వసతిగృహాల్లో టాయిలెట్లు, బాత్‌రూంలు సరిపడా లేక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మెనూ కొన్ని వసతి గృహాల్లో ఇంకా అమలుకు నోచుకోవడం లేదు. జిల్లాలో 19 బీసీ సంక్షేమ వసతిగృహాలు ఉన్నాయి. ఇవన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. 31 ఎస్సీ వసతిగృహాల్లో ఒక్కటి మినహా అన్ని సొంత భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. నాలుగు ఎస్టీ సంక్షేమ వసతిగృహాల్లో రెండు అద్దె భవనాల్లో, మరో రెండు సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. అద్దె భవనాల్లో నడుపుతున్న వసతిగృహాలకు సకాలంలో అద్దె చెల్లించని కారణంగా వసతిగృహాలకు తాళం వేస్తామంటూ యజమానులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ శుక్రవారం వసతి గృహాలను ‘విజిట్’ చేసింది. ఈ సందర్భంగా దృష్టికి వచ్చిన సమస్యలపై సమగ్ర కథనం...
-------------------------------------------------------
జిల్లాలోని వసతి గృహాల వివరాలు
------------------------------------------------------------
వసతి గృహాలు సంఖ్య విద్యార్థులు
----------------------------------------------------
బీసీ సంక్షేమ 19 1,820
ఎస్సీ సంక్షేమ 31 4,500
ఎస్సీ సంక్షేమ 4 650