Share News

మెడికల్‌ హబ్‌గా జగిత్యాల

ABN , Publish Date - Oct 12 , 2024 | 12:57 AM

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఆవిర్భవించిన జగిత్యాల జిల్లా మెడికల్‌ హబ్‌గా మారుతోం ది. జిల్లా ఏర్పాటు తదుపరి వైద్య రంగంలో ఊహించని మార్పులొచ్చాయి. కార్పోరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ప్రభు త్వ వైద్యం అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మెడికల్‌ హబ్‌గా జగిత్యాల
జగిత్యాలలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం

- జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్‌.. నర్సింగ్‌ కళాశాల

- మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పెరిగిన కాన్పులు

- టీ హబ్‌ ఏర్పాటుతో 51 రకాల ల్యాబ్‌ పరీక్షలు ఉచితం

- ఉచిత మోకాలి కీలు మార్పు శస్త్ర చికిత్సకు ఏర్పాట్లు

- జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అప్‌గ్రేడ్‌

జగిత్యాల, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఆవిర్భవించిన జగిత్యాల జిల్లా మెడికల్‌ హబ్‌గా మారుతోం ది. జిల్లా ఏర్పాటు తదుపరి వైద్య రంగంలో ఊహించని మార్పులొచ్చాయి. కార్పోరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ప్రభు త్వ వైద్యం అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ ప్రతీ ఒక్కరికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జగిత్యాల కేంద్రంగా వివిధ వైద్య సేవలను అంది స్తోంది. జగిత్యాలలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో జిల్లా కేంద్రంలో వైద్య రూపురేఖలు మారి పోయాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉండడంతో పాటు రోగులు ప్రైవేటు ఆసు పత్రులను వదిలి ప్రభుత్వ ఆసుపత్రుల బాటపట్టేలా పరిస్థి తి తయారయింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిట లాడుతున్నాయి.

రూ. 400 కోట్లతో మెడికల్‌ కళాశాల భవనం..

జగిత్యాలకు నూతనంగా మంజూరు అయిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు పక్కా భవనం నిర్మాణానికి రూ. 400 కోట్లు మంజూరు అయ్యాయి. ఇటీవల సుమారు రూ. 50 లక్షలతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భవనాల్లో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల తరగతులను 2022 నవంబరు 15వ తేదిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. పట్ట ణంలోని ఎస్సారెస్పీ క్యాంపులో అందుబాటులో ఉన్న సుమారు 30 ఎకరాల్లో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల భవనం నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కళాశాలలో 150 సీట్లు మంజూరు అయ్యాయి. ప్రస్తుతం మూడో బ్యాచ్‌ విద్యార్థులు కళాశాలలో ప్రవేశం పొందుతున్నారు. మరి కొద్ది రోజుల్లో పూర్తి సీట్లను కౌన్సెలింగ్‌ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. కళాశాలకు ప్రభుత్వం సుమారు 1,001 పోస్టులు మంజూరు చేసింది. ప్రస్తుతం 150 మంది విధులు నిర్వహిస్తున్నారు. కింది స్థాయి సిబ్బందిని తాత్కాలికంగా నియామకం చేశారు. భోదన సిబ్బంది పూర్తిస్థాయిలో నియామకం అయ్యారు. బాలికలకు, బాలురలకు వసతి గృహాలు, ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు పక్కాభవనం నిర్మాణ పనులు సైతం చురుకుగా జరుగుతున్నాయి.

వరంగా మారిన డయోగ్నస్టిక్‌ సెంటర్‌..

రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాలలోని దరూర్‌ క్యాంపులో సుమారు మూడు కోట్ల రూపాయల నిధులతో 2022 మార్చి 6వ తేదీన తెలంగాణ డయోగ్నస్టిక్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 42 రకాల పరీ క్షలు చేస్తున్నారు. ప్రతీ నిత్యం 100 మంది 120 మంది వరకు శాంపిళ్లు సేకరిస్తున్నారు. జిల్లా పరిధి లోని 17 పీహెచ్‌సీలు, మూడు సామాజిక ఆసుపత్రులు, ఒక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితో పాటు అదనంగా అదిలా బాద్‌ జిల్లా జన్నారం, నిజామాబాద్‌ జిల్లా చౌటుపల్లి, కమ్మ రిపల్లి పీహెచ్‌సీ కేంద్రాల పరిధిలోకి వస్తాయి. సుమారు 30 రూట్లలో ఐదు వాహనాలను కేటాయించారు. జిల్లాలో 689 కిలోమీటర్ల పరిదిలోని శాంపిళ్లు సేకరిస్తున్నారు. కేంద్రానికి శాంపిళ్లు రాగానే సుమారు రెండు, మూడు గంటల్లోగా ఇంటర్‌ నెట్‌ ద్వారా సంబంధిత రోగుల మొబైల్‌, మెయిల్‌కు సమాచారం అందిస్తున్నారు.

మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పెరిగిన కాన్పులు..

పట్టణంలోని ఎస్సారెస్పీ క్యాంపులో మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు రూ. 17 కోట్ల నిధులు వెచ్చించి భవనం నిర్మాణం చేయడంతో పాటు అవసరమైన సదు పాయాలను సమకూర్చారు. ఆసుపత్రిలో 12 లేబర్‌ గదులు, న్యూ బర్న్‌ బేబీ కేర్‌ సెంటర్‌, పీడియాట్రిక్‌ ఐసీయూ వార్డులను ఏర్పాటు చేశారు. మెడికల్‌ కళాశాలకు అను బంధంగా 260 బెడ్లను ఏర్పాటు చేశారు. ప్రతీ నిత్యం అధిక సంఖ్యలో ప్రసవాలు జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం సుమారు రూ. 30 లక్షల నిధులను వెచ్చించి ఇటీవల టార్గె టెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫ్యూటల్‌ ఎనామిలీస్‌ (టిఫా) స్కానింగ్‌ యంత్రాన్ని ఏర్పాటు చేసింది. కాగా సంబంధిత యంత్రం వినియోగించడానికి అవసరమైన నిపుణులైన వైద్య సిబ్బందిని అవసరమైనంత మేరకు నియమించాల్సి ఉంది.

జిల్లా ప్రధాన ఆసుపత్రి అప్‌గ్రెడేషన్‌..

పట్టణంలోని జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిని అప్‌గ్రేడే షన్‌ చేశారు. జిల్లాకు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల మంజూ రు కావడంతో ఇందుకు అనుబందంగా ప్రభుత్వ ఆసుపత్రి సైతం మంజూరు అయింది. అప్పటివరకు జగిత్యాలలో వంద పడకలతో కొనసాగుతున్న ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 260 పడకలు పెంచారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి అనుబందంగా మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇటీవల ప్రధాన ఆసుపత్రిలో స్కానింగ్‌ యంత్రాన్ని ప్రారంభించారు. పట్టణంలోని జగిత్యా ల రోడ్డు వైపు ప్రధాన రహదారి ప్రక్కన సొంత భవనంలో ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల నిర్వహిస్తున్నారు. సుమారు ఆరు సంవత్సరాల క్రితం నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రతీ యేడాది 150 సీట్లు రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో కోర్సులు పూర్తి చేసుకుంటున్నారు.

వైరాలజీ ల్యాబోరేటరీ సేవలు..

జిల్లా కేంద్రంలోని ఎస్సారెస్పీ క్యాంపులో జిల్లా వైరాలజీ ల్యాబోరెటరీని నిర్వహిస్తున్నారు. సుమారు రూ. 50 లక్షల నిధులతో వైరాలజీ ల్యాబోరెటరీ ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ దీర్ఘ కాలిక రోగాలకు అవసరమైన ల్యాబ్‌ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరి యా, కొవిడ్‌ తదితర రోగాలకు చెందిన వైద్య పరీక్షలను ఉచితంగా అందిస్తున్నారు. ప్రతీ నిత్యం వందల సంఖ్యలో రోగుల శాంపిళ్లను వివిధ ప్రాంతాల్లో గల ప్రభుత్వ ఆసుప త్రుల నుంచి సేకరించి పరీక్షలు నిర్వహించి రిపోర్టులను అందజేస్తున్నారు.

విస్తరిస్తున్న మరిన్ని సేవలు..

జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రా న్ని ఏర్పాటు చేశారు. ఆరు పడకలతో కేంద్రాన్ని నిర్వహిస్తు న్నారు. ప్రతీ నిత్యం 15 నుంచి 20 మందికి డయాలసిస్‌ సేవలను అందిస్తున్నారు. అదేవిధంగా ప్రధాన ఆసుపత్రిలో మోకాలి కీలు శస్త్రచికిత్సను ఉచితంగా నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నారు. సుమారు కోటి రూపాయల నిధులతో ఎస్సారెస్పీ క్యాంపులో రేడియాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేశా రు. కాగా పట్టణంలో ఇదివరకే నాలుగు అర్బన్‌ హెల్త్‌ సెం టర్ల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. వీటితో పాటు నాలుగు బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు.

సంతోషదాయకం

డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, ఎమ్మెల్యే, జగిత్యాల

అన్ని వర్గాల సహకారాలతో జగిత్యాల జిల్లా కేంద్రాన్ని మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దు తున్నాము. వైద్య రంగంలో జగి త్యాల అభి వృద్ధి చెందుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి దక్కుతుంది. పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిం చడానికి కృషి చేస్తున్నాము. ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ప్పటికీ ఒక వైద్యుడిగా ఆలోచించి వైద్య రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నాను.

సీఎం నేతృత్వంలో పకడ్బందీగా వైద్య సేవలు

అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జిల్లా కేంద్రంలో పకడ్బందీగా వైద్యసేవలు అందించడానికి నిరంతరం కృషి చేస్తు న్నాము. జగిత్యాల జిల్లా కేంద్రంలో వివిధ రకాల వైద్య సేవలు అందిస్తున్నాము. నిరుపేద ప్రజలకు అవసరమైన అన్నిరకాల వైద్య సేవలు అందించానికి చర్యలు తీసుకుంటున్నాము. ఎప్పటికప్పుడు వైద్య అధికారులు పర్యవేక్షణ జరిపి సరైౖన విధంగా సేవలు అందించేలా కృషి చేస్తున్నారు.

Updated Date - Oct 12 , 2024 | 12:57 AM