జయ జయహే మహిషాసుర మర్ధిని...
ABN , Publish Date - Oct 12 , 2024 | 12:30 AM
శరన్నవరాత్రి ఉత్సవాల్లో మహర్నవమి సందర్భంగా తొమ్మిదో రోజు శుక్రవారం నగరంలోని పలు ఆలయాల్లో, మండపాల్లో పూజలు, అలంకారాలు, అన్నదానాలు, అర్చనలు, అభిషేకాలు, హవనాలు నిర్వహించారు. చైతన్యపురి మహాశక్తి ఆలయంలో సిద్ధిరాత్రి రూపంలో ఉన్న అమ్మవారికి పసుపు కుంకుమలతో మహిషాసుర మర్దనిగా విశేషాలంకారం చేశారు.
కరీంనగర్ కల్చరల్, అక్టోబరు 11: శరన్నవరాత్రి ఉత్సవాల్లో మహర్నవమి సందర్భంగా తొమ్మిదో రోజు శుక్రవారం నగరంలోని పలు ఆలయాల్లో, మండపాల్లో పూజలు, అలంకారాలు, అన్నదానాలు, అర్చనలు, అభిషేకాలు, హవనాలు నిర్వహించారు. చైతన్యపురి మహాశక్తి ఆలయంలో సిద్ధిరాత్రి రూపంలో ఉన్న అమ్మవారికి పసుపు కుంకుమలతో మహిషాసుర మర్దనిగా విశేషాలంకారం చేశారు. అనంతరం నిర్వహించిన రుద్ర సహిత ఛండీ హోమంలో ఆలయ నిర్వాహకుడు, ఎంపి, కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌తో పాటు భవానీదీక్షాపరులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి దాండియా నృత్యం కొనసాగింది. బొమ్మకల్ రోడ్ యజ్ఞవరాహస్వామి ఆలయంలోని వసుధాలక్ష్మి, వరదుర్గా సమేత వాగ్వాదినీ మహాసరస్వతి అమ్మవారి ఆలయంలో చతుష్షష్ఠి పూజ, సామూహిక కుంకుమార్చన జరిగాయి. శ్రీపురంలో అమ్మవారికి మహిషాసుర మర్దని అలంకారం చేశారు. పాతబజార్ గౌరీశంకర, వావిలాలపల్లి హనుమత్ సహిత కనకదుర్గ, కమాన్‌రోడ్ రామేశ్వర, బొమ్మకల్ రోడ్ అంబాభవానీ ఆలయాల్లో పూజలు జరిగాయి.
ఫ మహాశక్తి ఆలయంలో మహిషాసుర సంహార లీల
మహర్నవమి సందర్భంగా శుక్రవారం చైతన్యపురి మహాశక్తి దేవాలయంలో జరిగిన మహిషాసుర సంహార లీలను కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రారంభించారు. ఆయన రాష్ట్ర, జిల్లా ప్రజలకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.