Share News

పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:21 AM

వినాయక నవరాత్రులు, మిలాద్‌ఉన్‌బీ పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీపీ అభిషేక్‌ మొహంతి అన్నారు. పోలీస్‌ కమిషనరేట్‌లోని జాన్‌విల్సన్‌ హాల్‌లో శాంతి కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీ అభిషేక్‌ మొహంతి మాట్లాడుతూ గణేష్‌ మండపాల వద్ద పోలీసుల సూచనలు పాటిస్తూ వచ్చే భక్తులకు భద్రత కల్పిస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని మండప నిర్వాహకులకు సూచించారు.

పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి

కరీంనగర్‌ క్రైం, సెప్టెంబరు 4: వినాయక నవరాత్రులు, మిలాద్‌ఉన్‌బీ పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీపీ అభిషేక్‌ మొహంతి అన్నారు. పోలీస్‌ కమిషనరేట్‌లోని జాన్‌విల్సన్‌ హాల్‌లో శాంతి కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీ అభిషేక్‌ మొహంతి మాట్లాడుతూ గణేష్‌ మండపాల వద్ద పోలీసుల సూచనలు పాటిస్తూ వచ్చే భక్తులకు భద్రత కల్పిస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని మండప నిర్వాహకులకు సూచించారు. గణేష్‌ ఉత్సవ కమిటీల్లో సంఘ విద్రోహ శక్తులకు, గతంలో అల్లర్లు సృష్టించిన వ్యక్తులకు చోటు కల్పించకూడదని తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, వాటికి స్పందించి ప్రజా శాంతికి భంగం కలిగించే చర్యలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా సమాచారం ఉంటే సంబంధిత పోలీస్‌ అధికారులకు తెలపాలని, సమస్య పరిష్కరించి బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిలాద్‌ ఉన్‌ నబీ పండుగ సందర్భంగా నిర్వహించే ర్యాలీ హైదరాబాద్‌లో నిర్ణయించినట్లు 19న జరుపుకోవాలన్నారు. ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని కోరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కరీంనగర్‌ ప్రజలంతా ఐక్యమత్యంతో పండగలు జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో టౌన్‌ ఏసీపీ నరేందర్‌, సీఐలు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:21 AM