Share News

గురుకుల పాఠశాల విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Nov 07 , 2024 | 12:58 AM

తెలంగాణలో గురుకుల పాఠశాల విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

గురుకుల పాఠశాల విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
విద్యార్థులతో కలిసి కేక్‌ కట్‌ చేస్తున్న విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

వెల్గటూర్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గురుకుల పాఠశాల విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ గురుకుల పాఠశాలల్లో డైట్‌, కాస్మొటిక్‌ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిన సందర్భంగా మండలంలోని స్తంభంపెల్లి మహాత్మా జ్యోతిభా పూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ హాజరయ్యారు. విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులతో కలిసి కేక్‌ కకట్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని గురుకుల పాఠశాలలో డైట్‌ మరియు కాస్మొటిక్‌ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచడం హర్షణీయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు, సంబంధిత శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కాస్మొటిక్‌ మరియు డైట్‌ చార్జీలను పెంచామన్నారు. పాఠశాలకు సంబంధించి సమస్యలు తన దృష్టికి తెచ్చారని వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ గోపిక జితేందర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శైలేంధర్‌రెడ్డి, మద్దుల గోపాల్‌రెడ్డి, పోలోజు శ్రీనివాస్‌, మెరుగు మురళి, సందీప్‌రెడ్డి, పూదరి రమేష్‌ , రాపాక శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

- రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

ఎండపల్లి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం మండలం లోని రాజారాంపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను రైస్‌ మిల్లర్లు ఇబ్బంది పెట్టవద్దని అన్నారు. రైతులకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాల న్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కొనుగోలు కేంద్రాల్లోనే నేరుగా వడ్లని అమ్ముకోవాలన్నారు. సన్నపు వడ్లు కూడా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో గుండాటి గోపిక జితెందర్‌రెడ్డి, సంగ రమేష్‌ యాదవ్‌, గెల్లు చంద్రశేఖర్‌, గాజుల మల్లేశం పాల్గొన్నారు.

బుగ్గారం (ఆంధ్రజ్యోతి): కల్యాణలక్ష్మి పథకం నిరుపేద ఆడబిడ్డల తల్లిదండ్రులకు వరం వంటిదని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 25 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు, 30 మందికి రూ. 7,61,500 విలువ గల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు, మండల నాయకులతో కలసి ప్రారంభించా రు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మాజీద్‌, డీసీఎంస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు వేముల సుభాష్‌, ఉపాధ్యక్షుడు నర్సాగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 12:58 AM