Share News

రుణ మాఫీ ఎప్పుడో..?

ABN , Publish Date - Nov 15 , 2024 | 01:02 AM

ఏకకాలంలో రుణమాఫీ వర్తిస్తుందని ఆశించిన రైతులకు నిరీక్షణ త ప్పడం లేదు.

రుణ మాఫీ ఎప్పుడో..?

జగిత్యాల, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఏకకాలంలో రుణమాఫీ వర్తిస్తుందని ఆశించిన రైతులకు నిరీక్షణ త ప్పడం లేదు. అధికారంలోకి వచ్చి 11 నెలలు గడిచిన పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ ఫలాలను అందించ లేక పోతుందనే విమర్శలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎదు ర్కొంటోంది. రూ. 2 లక్షలకు మించి బ్యాంకుల్లో రుణం ఉ న్న వారు పై మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తే తాము రై తుల ఖాతాల్లో మాఫీ సొమ్ము జమ చేస్తామని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రివర్గ సభ్యులు అనేక సం దర్భాల్లో పేర్కొన్నారు. దీంతో రూ. 2 లక్షలకు పైన ఉన్న మొత్తాన్ని రైతులు అప్పులు తీసుకువచ్చి బ్యాంకుల్లో కట్టా రు. అయితే ఇప్పటి వరకు రూ. 2 లక్షల మాఫీ సొమ్ము విడుదల కాలేదు. అలాగే రేషన్‌ కార్డులు లేనివారికి ఫ్యా మిలీ గ్రూపింగ్‌ (సర్వే)ను పూర్తి చేసినప్పటికీ వారికీ మాఫీ వర్తించలేదు.

కొంత మందికే...

ప్రభుత్వం పలు విడతల్లో రుణమాఫీ సొమ్మును విడుదల చేయగా జిల్లాలో సుమారు 2.70 లక్షల పంట రుణ ఖాతాలున్నాయి. రేషన్‌ కార్డు ఉన్న కుటుంబానికి రూ. 2 లక్షల వరకు మాఫీ వర్తింపజేయటం, ఇతర కార ణాల వల్ల 1,38,142 మంది అర్హులుగా ఉన్నట్లు గుర్తిం చారు. ఇప్పటి వరకు 72,116 మంది రైతులకు మూడు విడుతల్లో రుణ మాఫీ అయింది. బ్యాంకుల్లో వివరాలు లభ్యం కాకుండా 4,161 మంది రైతులున్నట్లు గుర్తించా రు. జిల్లా వ్యాప్తంగా రూ. 2 లక్షలకు పైగా రుణ మున్న రైతులు సుమారు 50,119 మంది ఉన్నట్లు తెలుస్తోంది. రేషన్‌ కార్డు లేక ఫ్యామిలీ గ్రూపింగ్‌ పూర్తయిన రైతులు సుమారు 4,500 ఉన్నట్లు అధికార వర్గాలు అంటున్నా యి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రూ. లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అనేక మందికి మాఫీ సొమ్ము అందలేదు. ప్రస్తుత కాం గ్రెస్‌ సర్కారు హయాంలో సైతం రుణ మాఫీ అర్హు లందరికి అందకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ ఎప్పుడు అందుతుం దా అని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.

స్పష్టత రావడం లేదు

- రౌతు చంద్రయ్య, రైతు, గోపాల్‌రావుపేట, జగిత్యాల రూరల్‌ మండలం

రుణమాఫీ కోసం రైతులు వ్యవసాయ శాఖ అధికారు లను ప్రశ్నిస్తే వారికి ఎలాంటి సమాధానం దక్కడం లే దు. వ్యవసాయ శాఖ అధికారులు కేవలం ఫ్యామిలీ గ్రూ పింగ్‌ చేయడం వరకే పరిమితమయ్యారు. రుణమాఫీ సొమ్ము జమయ్యే అంశం తమ పరిధిలో లేదని అధికారులు చెబుతున్నారు. రుణ మాఫీపై స్పష్టత రావడం లేదు.

రైతులను ఆదుకోవాలి

- కొల్లూరి లక్ష్మీ, మహిళా రైతు, తిప్పన్నపేట, జగిత్యాల రూరల్‌ మండలం

ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేసి రైతు లను ఆదుకోవాలి. రైతులకు ఇప్పట్లో నిధులు మంజూరు చేస్తే యాసంగి సీజన్‌ సాగు పెట్టుబడి, ఇతర అవస రాలకు ఎంతో ఊరట లభిస్తుంది. ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా మాఫీ సొమ్మును విడుదల చేయాలి.

Updated Date - Nov 15 , 2024 | 01:02 AM