Share News

వేతనాల కోసం ఎదురు చూపులు

ABN , Publish Date - Nov 15 , 2024 | 01:07 AM

భారతీయ తపాల శాఖలో గ్రామీణ డాక్‌ సేవకులకు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.

వేతనాల కోసం ఎదురు చూపులు

భగత్‌నగర్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): భారతీయ తపాల శాఖలో గ్రామీణ డాక్‌ సేవకులకు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామీణ డాక్‌ సేవకులు వందల సంఖ్యలో పనిచేస్తున్నారు. వీరు తపాలా పనులన్నీ చక్క బెడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో సబ్‌స్టిట్యూట్‌ డాక్‌ సేవకుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. వారి ఏళ్లుగా జీతాలు అందడ లేదు. గ్రామీణ డాక్‌ సేవకులు సబ్‌ పోస్టాఫీసుల నుంచి ఉత్తరాలు, పార్సిల్సు, మనీఆర్డర్లు, మెగజైన్‌లు, స్టేషనరీలను బట్వాడా చేస్తుంటారు. వీరికి నెలకు 14 వేల రూపాయలు అందించాల్సి ఉంది. ఒక్కో గ్రామీణడాక్‌ సేవకుడికి నాలుగు నెలల నుంచి సంవత్సరానికిపైగా కొంత మందికి రెండు సంవత్సరాల నుంచి వేతనాలు రావడం లేదని వాపోతున్నారు.

రోజు వారీ ఖర్చులు

నిత్యం సబ్‌ పోస్టాఫీసుల నుంచి ఉత్తరాలను బట్వాడాచేయడానికి ద్విచక్ర వాహనాల్లో వంద నుంచి రెండు వందల వరకు పెట్రోల్‌కు ఖర్చు అవుతుందని డాక్‌ సేవకులు అంటున్నారు. అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్‌ సూపరిండెంట్‌, పోస్టు మాస్టర్‌ జనరల్‌ దృష్టికి తీసుకు వెళ్లినా తమ సమస్యలుపరి ష్కారంకావడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా తమకు రావాల్సిన వేతనాలు అందించి ఆదుకోవాలని గ్రామీణ డాక్‌ సేవకులు వేడుకుంటున్నారు.

అధికారులు పట్టించుకోవడం లేదు..

- బొల్లం నిఖిల్‌, మానకొండూర్‌

వేతనాల ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదు. రెండు సంవత్సరాలుగా మానకొండూర్‌లో స్టాఫ్‌ గ్యాప్‌ పోస్ట్‌మాకచన్‌గా విధులు నిర్వహిస్తున్నా వేతనాలు మాత్రం రావడంలేదు. తపాల శాఖ జాతీయ సంస్థ అయినందున కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌ జోక్యం తీసుకుని వేతనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి.

పెట్రోల్‌ ఖర్చులకు అప్పులు చేస్తున్నాం

- యూర గిరిప్రసాద్‌

నిత్యం ఉత్తరాల బట్వాడా కోసం పెట్రోల్‌ ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నాం. తక్కువ జీతాలు ఉన్నా సర్దుకుపోయి పని చేస్తున్నాం. అవీ సక్రమంగా ఇవ్వకపోవడంతో కుటుంబపోషణ భారంగా మారింది. జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి మా సమస్యకు పరిష్కారం చూపించాలి.

Updated Date - Nov 15 , 2024 | 01:07 AM