దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మన్మోహన్‌సింగ్..
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:14 AM
దేశం లో అనేక సంస్కరణలు తీసుకువచ్చి ఆర్థికంగా నిలబెట్టిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని మ న్మోహన్‌సింగ్ అని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుం ట విజయరమణారావు అన్నారు.
ఎలిగేడు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): దేశం లో అనేక సంస్కరణలు తీసుకువచ్చి ఆర్థికంగా నిలబెట్టిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని మ న్మోహన్‌సింగ్ అని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుం ట విజయరమణారావు అన్నారు. మండలంలోని శివపల్లిలో ఆయన మాజీ ప్రధాని మన్మోహన్‌సిం గ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన ఆర్థిక వృద్ధిరే టును పరుగులు పెట్టించిన మహోన్నత వ్యక్తని కొనియాడారు. ఆర్థిక శాస్త్రవేత్తగా తన జీవితాన్ని ప్రారంభించిన మన్మోహన్‌సింగ్ అంచలంచెలుగా ఎదుగుతూ ప్రధానిగా రెండు పర్యాయాలు పని చేసి దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలి పారన్నారు. పీవీ.నరసింహారావు ప్రధానిగా ఉన్న ప్పుడు మన్మోహన్‌సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియ మించి దేశ ఆర్థిక చరిత్రని మలుపు తిప్పే ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఎక నామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ అంచలంచెలుగా ఎదిగి ప్రధానిగా పనిచేసి నిరాడంబరుడిగా, సౌమ్యుడిగా దేశ రాజకీయాల్లో, ప్రజల హృద యాల్లో మన్మోహన్‌సింగ్ చెరగని ముద్ర వేసుకు న్నారని తెలిపారు. ఆయన మరణం దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని చెప్పారు. మన్మో హన్‌సింగి కుటుంబానికి మనోధైర్య కల్పించాలని ఆభగవంతున్ని కోరారు. ఈ కార్యక్రమంలో సు ల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్‌రావు, దుగ్యాల సంతోష్‌రావు, చిలుక సతీ ష్, సాయిరి మహేందర్, అబ్బయ్యగౌడ్, నరసిం హారెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.