Share News

విపత్తును ఎదుర్కొనేలా ప్రభుత్వం చర్యలు

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:33 AM

ప్రకృతి విపత్తులను ఎదు ర్కోవటానికి ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిరం తరం అప్రమత్తంగా ఉన్నామని మంత్రి దుద్దిళ్ళ శ్రీధ ర్‌బాబు స్పష్టం చేశారు.

విపత్తును ఎదుర్కొనేలా ప్రభుత్వం చర్యలు

మంథని, సెప్టెంబరు 4 : ప్రకృతి విపత్తులను ఎదు ర్కోవటానికి ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిరం తరం అప్రమత్తంగా ఉన్నామని మంత్రి దుద్దిళ్ళ శ్రీధ ర్‌బాబు స్పష్టం చేశారు. మంథని తీరంలోని గోదావ రినదిలో వరద ఉధృతిని మంత్రి శ్రీధర్‌బాబు బుధ వారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని అధి కారులతో ప్రభుత్వపరంగా ఎప్పటికప్పుడు మాట్లాడు తూ వారిని అప్రమత్తం చేస్తూ ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నా రు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు, రాష్ట్రం లోని ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదనీటిని అధికా రులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దిగువకు వదు లుతున్నారన్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మున్సిపల్‌ పరిధి లో కాలువల్లో మురికినీరు, చెత్తను తొలగించి శుభ్రం చేయాలన్నారు. కురుస్తున్న వర్షాలకారణంగా దోమల ద్వారా వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. వైద్యా ధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలితే వెంటనే హెల్త్‌క్యాం పులు ఏర్పాటు చేసి నివారణ చర్యలు తీసుకోవాల న్నారు. మంథని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి వ్యక్తి మెరుగైన వైద్య సేవలందేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయాధికారులతో ఫోన్‌ మాట్లాడి క్షేత్రస్థాయిలో పంటల నష్టాన్ని పరిశీ లించి రైతులకు ధైర్యం చెప్పాలని, ఎంత మేర పంట నష్టం జరిగిందో చూడాలని ఆదేశించారు. వెంట ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండ్రి రమ-సురేష్‌రెడ్డి, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఉన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:35 AM